Breaking News

ఆర్జీవీ 'వ్యూహం' సినిమాకు లైన్‌ క్లియర్‌

Published on Thu, 02/08/2024 - 16:18

టాలీవుడ్‌ ప్రముఖ డైరెక్టర్‌ రామ్‌ గోపాల్‌ వర్మ తెరకెక్కించిన 'వ్యూహం' సినిమా విడుదలకు లైన్‌ క్లియర్‌ అయింది. హైకోర్టు సూచనలతో రెండోసారి కూడా సెన్సార్‌ బోర్డు వ్యూహం సినిమాకు క్లియెరెన్స్‌ ఇచ్చింది. దీంతో ఈ చిత్రానికి ఉన్న అడ్డంకులు తొలిగిపోయాయి. వ్యూహం చిత్రాన్ని ఫిబ్రవరి 16న విడుదల చేయాలని ప్లాన్‌ చేస్తున్నట్లు నిర్మాత దాసరి కిరణ్‌ తెలిపారు.

వాస్తవానికి రెండు నెలల క్రితమే వ్యూహం సినిమా సెన్సార్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమైంది. కానీ సినిమా విడుదలను నిలిపివేవయాలని తెలంగాణ హైకోర్టులో టీడీపీ నేత నారా లోకేష్‌ పిటిషన్‌ దాఖలు చేయడంతో ఈ చిత్రం విడుదల అంశంలో జాప్యం ఎదురైంది. లోకేష్‌ పిటిషన్‌తో హై కోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చి సినిమా విడుదలను గతంలో తాత్కాలికంగా నిలువరించింది. వ్యూహం సినిమాను మరొకసారి సమీక్షించి ఒక కమిటీని ఏర్పాటు చేసి మరొకసారి సెన్సార్‌ ఇవ్వాలని గతంలో కొర్టు తెలిపింది.

(ఇదీ చదవండి: థియేటర్‌లో అలజడి రేపిన పవన్‌ ఫ్యాన్స్‌.. ఇంకెప్పుడు మారుతారో..!)

కోర్టు నిర్ణయంతో మరోసారి వ్యూహం చిత్రానికి తాజాగా సెన్సార్‌ నిర్వహించారు. చిత్రాన్ని విడుదల చేసుకునేందుకు ఎలాంటి ఇబ్బందులు లేవని సెన్సార్‌ బోర్డు తెలపడంతో వ్యూహం చిత్రం ఫిబ్రవరి 16న విడుదల చేసే ప్లాన్‌లో ఉన్నామని చిత్ర నిర్మాత తెలిపారు. దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి మరణం తరువాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో జరిగిన పరిణామాల ఆధారంగా ఈ సినిమాను రామ్ గోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే.

Videos

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

Photos

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)