Breaking News

మళ్ళీ పెళ్లితో పెద్ద హిట్‌ సాధిస్తాం

Published on Fri, 05/26/2023 - 05:07

‘‘పెళ్లనేది పవిత్రమైనది. దాన్ని గౌరవించాలనే కోణంలో ‘మళ్ళీ పెళ్లి’ సినిమా చేశాం. యువతరంతో పాటు అన్ని వయసుల వారికీ కనెక్ట్‌ అయ్యే కథ ఈ చిత్రంలో ఉంది. పెద్ద హిట్‌ సాధిస్తామనే నమ్మకం ఉంది’’ అన్నారు వీకే నరేశ్‌. ఆయన హీరోగా నటించి, నిర్మించిన చిత్రం ‘మళ్ళీ పెళ్లి’. ఎమ్మెస్‌ రాజు దర్శకత్వం వహించారు. నరేశ్‌కి జోడీగా పవిత్రా లోకేష్‌ నటించిన ఈ సినిమా నేడు విడుదలవుతోంది.

ఈ సందర్భంగా గురువారం వీకే నరేశ్‌ విలేకరులతో మాట్లాడుతూ– ‘‘మా అమ్మగారు (విజయ నిర్మల) తన ఆలోచనలను సినిమాల్లో చూపించాలని కృష్ణగారితో కలసి 1972లో విజయకృష్ణ మూవీస్‌ని స్థాపించారు. ఈ బేనర్‌ స్థాపించి 50 ఏళ్లు, నా సినీ జీవితం ప్రారంభించి కూడా యాభై ఏళ్లు. ఈ సమయంలో హీరోగా ‘మళ్ళీ పెళ్లి’ సినిమా చేయడం నా అదృష్టం. ఈ సినిమా వినోదంతో పాటు షాకింగ్‌గా ఉంటుంది.. నటుడిగా థ్రిల్‌గా ఉంది.

పదికోట్ల మందిలో వందమంది కూడా బిజీగా ఉండరు. ఇక సినిమాలకు వస్తే.. పది మంది హీరోలే బిజీగా ఉంటారు. నేను హీరోగా హిట్స్‌ ఇచ్చాను, క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా చేశాను. ఇప్పుడు మళ్లీ హీరోగా చేస్తున్నాను. విజయకృష్ణ మూవీస్‌ లాంటి పెద్ద బ్యానర్‌ని మళ్లీ తీసుకురావడం, కృష్ణ–విజయ నిర్మలగార్ల వారసత్వాన్ని కాపాడటం, ఒక మంచి ఎంటర్‌టైనర్‌ ఇవ్వడం.. ఇవన్నీ నిర్మాతగా నాకు పెద్ద బాధ్యత. ఈ విషయంలో రాజుగారిని నమ్మాను’’ అన్నారు.

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)