Breaking News

కోర్టు గొడవల్లో 'భోళా శంకర్'.. ఇంతకీ ఏమైంది?

Published on Wed, 08/09/2023 - 10:56

మెగాస్టార్ చిరంజీవి 'భోళా శంకర్' వాయిదా పడనుందా? ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే అదే సందేహం వస్తోంది.  మరో రెండు రోజుల‍్లో రిలీజ్ ఉందనగా, ఓ డిస్ట్రిబ్యూటర్ కోర్టుకి వెళ్లాడు. 'భోళా శంకర్' నిర్మాతలపై కేసు పెట్టాడు. మూవీని విడుదల చేయకుండా ఆపాలని కోరాడు. ఇప్పుడు ఈ విషయం కాస్త ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారిపోయింది. సదరు డిస్ట్రిబ్యూటర్.. ఓ ప్రెస్ నోట్‌తో పాటు వీడియోని రిలీజ్ చేశారు. 

(ఇదీ చదవండి: గుండెపోటుతో స్టార్ డైరెక్టర్ కన్నుమూత)

ఏం జరిగింది?
అఖిల్ హీరోగా నటించిన 'ఏజెంట్' ఏప్రిల్ 27న థియేటర్లలోకి వచ్చింది. బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా ఘోరంగా ఫ్లాప్ అయింది. నిర్మాత, డిస్ట్రిబ్యూటర్, బయ్యర్లు అందరికీ కోట్లలో నష్టాలు వచ్చాయి. అయితే ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ అధినేతలు రూ.30 కోట్లు తీసుకుని తనని మోసగించారని వైజాగ్ డిస్ట్రిబ్యూటర్ వైజాగ్ సతీష్ అలియాస్ బత్తుల సత్యనారాయణ కోర్టులో కేసు వేశారు. అలానే ఓ ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేశారు. 

నన్ను మోసం చేశారు
'ఏజెంట్ సినిమా డిస్ట్రిబ్యూషన్ హక్కుల విషయంలో అనిల్ సుంకర, గరికపాటి కృష్ణకిశోర్ నన్ను మోసం చేశారు. వారు చేసిన అన్యాయం ప్రతి ఒక్కరికీ తెలియాల్సిన అవసరం ఉంది. ఏజెంట్ డిస్ట్రిబ్యూషన్ హక‍్కుల్ని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలకు ఐదేళ్లపాటు నాకు చెందిన గాయత్రి ఫిల్మ్స్‌కు అందజేస్తామని అగ్రిమెంట్ రాసిచ్చారు. రూ.30 కోట్లు తీసుకుని నన్ను మోసం చేశారు. ఈ మొత్తం చెల్లించినట్లు నా దగ్గర పక్కా ఆధారాలు ఉన్నాయి.'

(ఇదీ చదవండి: 'భోళా శంకర్'.. ఇక అంతా బోనస్‌!)

అండర్ టేకింగ్ లెటర్!
'అయితే ఏజెంట్ డిస్ట్రిబ్యూషన్ హక్కులు కేవలం విశాఖపట్నం జిల్లా వరకు మాత్రమే ఇచ్చి, అగ్రిమెంట్ బ్రేక్ చేశారు. మే 1న హైదరాబాద్ వెళ్లి ఈ విషయమై గరికపాటి కృష్ణ కిశోర్‌ని కలిశాను. ఆయన అనిల్ సుంకరతో మాట్లాడారు. ఏజెంట్ డిజాస్టర్ అయిందని చెప్పి, అండర్ టేకింగ్ లెటర్ ఇస్తామని చెప్పారు. దీంతో డబ్బులు ఎలాగైనా వస్తాయని నమ్మి, వైజాగ్ వెళ్లిపోయాను. 'సామజవరగమన' వైజాగ్ హక్కులు నాకు ఇచ్చారు కానీ కొద్ది డబ్బు మాత్రమే కవర్ అయింది'

'భోళా శంకర్'కు బ్రేక్?
'దీంతో 45 రోజుల్లో నాకు రావాల్సిన మిగతా డబ్బు ఇస్తామని చెప్పారు. లేదంటే తర్వాత విడుదలకు 15 రోజుల ముందు ఇస్తామని అగ్రిమెంట్ ఇచ్చారు. వాళ్ల తర్వాత మూవీ 'భోళా శంకర్'. ఈ విషయమై మాట్లాడాదామని ప్రయత్నిస్తుంటే నాకు సమాధానం ఇవ‍్వట్లేదు. ఫిలిం ఛాంబర్ పెద్దలకు చెప్పినా ప్రయోజనం లేకుండా పోయింది. అందుకే తప్పని పరిస్థితుల్లో కోర్టుకు వెళ్లాను' అన వైజాగ్ సతీశ్ చెప్పుకొచ్చారు. బుధవారం కోర్టులో హియరింగ్ జరగనుంది. దీనిపై క్లారిటీ రావడంతోపాటు 'భోళా శంకర్' రిలీజ్ విషయంలోనూ స్పష్టత వస్తుంది.

(ఇదీ చదవండి: మనవరాలికి మెగాస్టార్ దంపతుల స్పెషల్ గిఫ్ట్.. అదేంటో తెలుసా?)

Videos

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

Photos

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)