Breaking News

రోజూ రాత్రి తాగొచ్చి తెల్లారి నటిస్తే నమ్ముతారా?: వివేక్‌ అగ్నిహోత్రి

Published on Thu, 07/27/2023 - 13:34

పాన్‌ ఇండియా స్టార్‌ ట్యాగ్‌ వచ్చినప్పటినుంచి ప్రభాస్‌ ఆ రేంజ్‌లో ఒక్కటంటే ఒక్క హిట్‌ కూడా అందుకోలేకపోతున్నాడు. బాహుబలి తర్వాత అతడు చేసిన సినిమాలేవీ పెద్దగా ఆడలేదు. భారీ బడ్జెట్‌తో వచ్చిన రాధేశ్యామ్‌, ఆదిపురుష్‌ కూడా బాక్సాఫీస్‌ దగ్గర చతికిలపడ్డాయి. అయితే రాధేశ్యామ్‌ రిలీజైన రోజు వివేక్‌ అగ్నిహోత్రి దర్శకత్వం వహించిన కశ్మీర్‌ ఫైల్స్‌ సినిమా కూడా విడుదలైంది. రాధేశ్యామ్‌ బాక్సాఫీస్‌ దగ్గర ఫెయిలవగా చిన్న సినిమా కశ్మీర్‌ ఫైల్స్‌ మాత్రం పాజిటివ్‌ టాక్‌తో వంద కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. 

అప్పటి నుంచి బాలీవుడ్‌ను, బాలీవుడ్‌లో సినిమాలు చేస్తున్న ప్రభాస్‌పైనా తీవ్ర విమర్శలు గుప్పిస్తూ వస్తున్నాడు. తాజాగా మరోసారి డార్లింగ్‌ హీరో మీద, అతడు చేసిన ఆదిపురుష్‌ చిత్రంపైనా విరుచుకుపడ్డాడు. 'ప్రజల నమ్మకాలకు సంబంధించిన కథలను ఎంచుకున్నప్పుడు మీక్కూడా దానిపై విశ్వాసం ఉండాలి లేదంటే ఆ సబ్జెక్ట్‌లో ఎంతోకొంత ప్రావీణ్యం ఉండాలి. దురదృష్టవశాత్తూ భారత్‌లో ఎవరూ దాన్ని పట్టించుకోవట్లేదు. రామాయణం, మహాభారతం వంటి ఇతిహాసాలను పెద్ద పెద్ద స్టార్లతో కలిసి సినిమా చేయాలనుకుంటే అది అంత ఈజీగా పూర్తవదు. ఒకవేళ పూర్తి చేసినా అది సంపూర్ణంగా ఉండదు.

ఈ పురాణాలు వేల సంవత్సరాలుగా అందరి మనసుల్లో ముద్రపడి ఉన్నాయంటే దానికున్న ప్రాముఖ్యతను అర్థం చేసుకోవచ్చు. (ఆదిపురుష్‌లో ప్రభాస్‌ రోల్‌ను పరోక్షంగా ప్రస్తావిస్తూ..) కొందరు స్క్రీన్‌పై వచ్చి నేనే దేవుడిని అని చెప్తే నిజంగానే అతడు భగవంతుడయిపోతాడా? రోజూ రాత్రి ఇంటికి తాగి వచ్చి తెల్లారి నేను దేవుడిని, నన్ను నమ్మండి అని చెప్తే ఎవరూ నమ్మరు. జనాలేమీ పిచ్చోళ్లు కారుగా' అని ఘాటుగా వ్యాఖ్యానించాడు. వివేక్‌ అగ్నిహోత్రి వ్యాఖ్యలు ప్రస్తుతం ఫిల్మీదునియాలో వైరల్‌గా మారాయి.

చదవండి: పెళ్లయిన 8 ఏళ్లకు బుల్లితెర నటికి ప్రెగ్నెన్సీ.. కానీ కడుపులోనే
ఛాన్స్‌ ఇవ్వమంటే అవమానించాడు: డైరెక్టర్‌

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)