Breaking News

చిరంజీవి బర్త్‌డే గిఫ్ట్స్‌.. అభిమానులకు పండగే

Published on Sat, 08/16/2025 - 07:08

చిరంజీవి నటిస్తున్న కొత్త సినిమా ‘విశ్వంభర’ నుంచి మరో టీజర్‌ విడుదల కానుంది. ఈమేరకు షోషల్‌మీడియాలో వైరల్‌ అవుతుంది.  సోషియో ఫ్యాంటసీ యాక్షన్‌ అడ్వెంచరస్‌ సినిమాకు వశిష్ఠ దర్శకత్వం వహిస్తున్నారు. యూవీ క్రియేషన్స్‌ పతాకంపై విక్రమ్, వంశీ, ప్రమోద్‌ నిర్మిస్తున్న ఈ సినిమా ఇదే ఏడాది సంక్రాంతికి విడుదల కావాల్సింది... కానీ కుదర్లేదు. ‘గేమ్‌ ఛేంజర్‌’ సినిమా కోసం ఈ సినిమా విడుదలను వాయిదా వేశామని అప్పట్లో ఈ చిత్రం యూనిట్‌ పేర్కొంది. అయితే, ఈ మూవీకి సంబంధించి విడుదలై మొదటి టీజర్‌ గ్రాఫిక్స్‌ వర్క్‌పై విమర్శలు వచ్చాయి. ఆ సమయం నుంచి పెద్దగా అప్డేట్స్‌ మాత్రం బయటకు రావడం లేదు.

విశ్వంభర గ్రాఫిక్స్‌ వర్క్‌పై విమర్శలు రావడంతో దర్శకుడు వశిష్ఠి పలు జాగ్రత్తలు తీసుకున్నారట. మరింత సమయం తీసుకున్నా సరే సినిమా హిట్‌ కావాలనే సంకల్పంతో పనిచేశాడట. ఈ క్రమంలోనే ఆగష్టు 22న చిరంజీవి పుట్టినరోజు వస్తుండటంతో  అభిమానులు విశ్వంభర నుంచి ఏదైనా గిఫ్ట్‌ వస్తుందని ఆశిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు టీజర్‌ను సిద్ధం చేసింది చిత్ర బృందం.  ఆపై విడుదల విషయంలో కూడా ఒక క్లారిటీ ఇవ్వాలని మేకర్స్‌ ప్లాన్‌ చేస్తున్నారట. మరోవైపు అనిల్‌ రావిపూడి కూడా చిరు పుట్టినరోజుకు కానుక ఇవ్వాలని చూస్తున్నారట. సినిమా టైటిల్‌ ప్రకటించాలని ఉన్నట్లు తెలిసింది. ఈ చిత్రం వచ్చే సంక్రాంతికి విడుదల కానుంది.

విశ్వంభర అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతుంది. ఇందులో త్రిష హీరోయిన్‌గా, ఆషికా రంగనాథ్, కునాల్‌ కపూర్‌ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాకు ఎమ్‌ఎమ్‌ కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాను  ఇదే ఏడాది చివర్లో విడుదల చేసే ఆలోచనలో ఉన్నారట. 

Videos

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

Photos

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)