Breaking News

‘విశ్వంభర’ రిలీజ్‌పై చిరు అప్‌డేట్‌.. వామ్మో అంత లేటా?

Published on Thu, 08/21/2025 - 09:55

మెగాస్టార్‌ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రాల్లో విశ్వంభర ఒకటి. ఈ మూవీ షూటింగ్‌ ఎప్పుడో పూర్తయింది. వాస్తవానికి ఈ ఏడాది జనవరిలోనే రిలీజ్‌ కావాల్సింది కూడా. అయితే వీఎఫ్‌ఎక్స్‌ పనులు ఇంకా పూర్తకాకపోవడంతో వాయిదా వేశారు. అప్పటి నుంచి రిలీజ్‌ డేట్‌పై చిత్రబృందం క్లారిటీ ఇవ్వలేదు. 

సమ్మర్‌, దసరా, దీపావళి, సంక్రాంతి అంటూ నెట్టింట చర్చలు జరిగినా..మేకర్స్‌ మాత్రం విడుదల తేదిపై స్పందించలేదు. తాజాగా ఈ సినిమా రిలీజ్‌పై మెగాస్టార్‌ చిరంజీవి క్లారిటీ ఇచ్చాడు. వచ్చే ఏడాది సమ్మర్‌లో ఈ చిత్రం విడుదల అవుతుందని చెప్పారు. ఆలస్యానికి గల కారణాన్ని వివరిస్తూ ఓ స్పెషల్‌ వీడియోని రిలీజ్‌ చేశాడు(Vishwambhara Update) 

‘విశ్వంభర ఎందుకు ఆలస్యం అవుతుందని చాలా మందికి అనుమానం ఉంది. ఆ జాప్యం సముచితమని నేను భావిస్తున్నాను. ఈ సినిమా సెకండాఫ్‌ మొత్తం వీఎఫ్‌ఎక్స్‌ మీద ఆధారపడి ఉంది.  దీన్ని అత్తుత్తమంగా మీకు అందించాలనే ప్రయత్నమే ఈ జాప్యానికి కారణం. 

ఎలాంటి విమర్శలకు చోటివ్వకూడదని ఈ నిర్ణయం తీసుకున్నాం. ఈ సినిమా చందమామ కథలా సాగిపోతుంది. చిన్నాపెద్దా తేడా లేకుండా ఈ సినిమా అందర్నీ అలరిస్తుంది. దీని గ్లింప్స్‌ను ఆగస్టు 21 సాయంత్రం 6.06కు విడుదల చేస్తున్నారు. ఇక ఈ సినిమాను అందరూ ఎంజాయ్‌ చేసేలా దీన్ని ప్రేక్షకుల ముందుకుతీసుకువస్తారు. 2026 సమ్మర్‌లో ఎంజాయ్‌ చేయండి’ అని చిరంజీవి తెలిపారు.

విశ్వంభర విషయానికొస్తే.. చిరంజీవి హీరోగా నటించిన సోషియో ఫ్యాంటసీ అడ్వెంచరస్‌ మూవీ ఇది. ఈ సినిమాకు వశిష్ఠ దర్శకత్వం వహించారు. త్రిషా కృష్ణన్‌ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాలో హీరోయిన్‌ ఆషికా రంగనాథ్, కునాల్‌ కపూర్‌ ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. యూవీ క్రియేషన్స్‌ పతాకంపై వంశీ, ప్రమోద్, విక్రమ్‌ ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.

 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)