Breaking News

మూడు వారాలకే ఓటీటీలోకి వచ్చేసిన 'మెకానిక్ రాకీ'

Published on Fri, 12/13/2024 - 07:17

కొత్త సినిమాలు మరీ త్వరగా ఓటీటీల్లోకి వచ్చేస్తున్నాయి. ఇప్పుడు కూడా అలానే లేటెస్ట్ తెలుగు మూవీ ఒకటి.. సడన్ సర్‌ప్రైజ్ అన్నట్లు వచ్చేసింది. మొన్ననే థియేటర్లలో రిలీజైంది. ఇది జరిగిన మూడు వారాలు అయిందో లేదో ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది. ఇంతకీ ఏంటా సినిమా? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది?

యంగ్ హీరో విశ్వక్ సేన్.. వరస సినిమాలు చేస్తూ అలరిస్తున్నాడు. ఈ ఏడాది 'గామి', 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' చిత్రాలు చేశాడు గానీ ఇవి అనుకున్నంత సక్సెస్ కాలేదు. దీంతో నవంబర్ 22న 'మెకానిక్ రాకీ'గా వచ్చాడు. అయితే ఈ మూవీ సెకండాఫ్ బాగున్నా ఫస్టాప్ మరీ తీసికట్టుగా ఉండటం మైనస్ అయింది. దీంతో ప్రేక్షకులు పెద్దగా పట్టించుకోలేదు.

(ఇదీ చదవండి: రాజకీయాల్లోకి అల్లు అర్జున్‌.. క్లారిటీ ఇచ్చిన టీమ్‌)

ఈ క్రమంలోనే ఎలాంటి ప్రకటన లేకుండా ఇప్పుడు ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ ఓటీటీలోకి వచ్చేసింది. ఈ వీకెండ్ ఎలా టైమ్ పాస్ చేయాలా అని ఆలోచిస్తుంటే 'మెకానిక్ రాకీ' చూస్తే ఎంజాయ్ చేసేయండి. సినిమా విషయానికొస్తే.. రాకీ (విష్వక్) మెకానిక్ గ్యారేజ్‌తో పాటూ డ్రైవింగ్ స్కూల్ నడుపుతుంటాడు. వారసత్వంగా వచ్చిన ఈ గ్యారేజ్‪‌లో తండ్రితో కలిసి పనిచేస్తుంటాడు. అనుకోని పరిస్థితుల్లో రాకీ తండ్రి చనిపోతాడు.

ఇదిలా ఉండగా మాయ (శ్రద్ధ శ్రీనాథ్) మెకానిక్ రాకీ దగ్గర డ్రైవింగ్ స్కూల్‌లో చేరుతుంది. మధ్యలో రంకిరెడ్డి అనే ఓ కబ్జాదారుడు (సునీల్).. ఆ మెకానిక్ షెడ్డుని కబ్జా చేయబోతాడు. ఈలోగా చనిపోయిన తండ్రి పేరు మీద రూ.2 కోట్లు ఇన్సూరెన్స్ ఉందని, ఆ డబ్బు వస్తుంది కనుక రంకిరెడ్డి మొహాన కొంత కొట్టి ఆ కబ్జా నుంచి తప్పించుకోవచ్చని దారి చూపిస్తుంది మాయ. ఆ తర్వాత ఏం జరుగుతుందనేది మిగతా కథ.

(ఇదీ చదవండి: బిగ్‌బాస్‌ 8కు అందుకే వచ్చానన్న గౌతమ్‌.. ఏడ్చేసిన అవినాష్‌!)

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)

+5

హైదరాబాద్ : ఎగ్జిబిషన్‌ మైదానంలో సందడిగా దత్తన్న అలయ్‌ బలయ్‌ (ఫొటోలు)

+5

ప్రభాస్ హీరోయిన్ కొత్త ఫొటోలు! (ఫొటోలు)