లైలాగా టాలీవుడ్‌ హీరో.. హీరోయిన్లే కుళ్లుకునేలా..

Published on Wed, 07/03/2024 - 13:11

ఎటువంటి బ్యాక్‌గ్రౌండ్‌ లేకుండా ఇండస్ట్రీలో అడుగుపెట్టి నిలదొక్కుకున్న హీరోల్లో విశ్వక్‌ సేన్‌ ఒకరు. ఐదేళ్ల క్రితం ఫలక్‌నుమా దాస్‌ మూవీతో బ్లాక్‌బస్టర్‌ హిట్‌ అందుకున్న ఈయన తర్వాత ఎన్నో రకాల ప్రయోగాలు చేశాడు. యాటిట్యూడ్‌ చూపించే విశ్వక్‌ కేవలం మాస్‌ సినిమాలకే సెట్టవుతాడన్న అభిప్రాయాలను అశోకవనంలో అర్జున కల్యాణం మూవీతో తప్పని రుజువు చేశాడు. 

లైలాగా మారిన హీరో
ఈ ఏడాది గామితో హిట్‌ కొట్టి గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరితో పర్వాలేదనిపించిన ఈ హీరో తాజాగా సరికొత్త ప్రాజెక్ట్‌ను ఎంచుకున్నాడు. ఇందులో లేడీ గెటప్‌లో కనిపించనున్నాడు. ఈ మూవీకి లైలా అనే టైటిల్‌ ఖరారు చేశారు. బుధవారం ఈ సినిమాను లాంఛనంగా ప్రారంభించారు. విశ్వక్‌ సేన్‌ హీరోగా నటిస్తుండగా ఆకాంక్ష శర్మను హీరోయిన్‌గా తీసుకున్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది ప్రేమికుల దినోత్సవం నాడు విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. 

ఫస్ట్‌ లుక్‌ రిలీజ్‌
ఈ మేరకు రిలీజ్‌ డేట్‌తో కూడిన ఓ ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ కూడా విడుదల చేశారు. అందులో లేడీ గెటప్‌లో ఉన్న విశ్వక్‌ కళ్లు మాత్రమే చూపించారు. ఇది చూసిన నెటిజన్లు హీరోయిన్లు సైతం కుళ్లుకునేంత అందంగా ఉన్నావంటూ కామెంట్లు చేస్తున్నారు. రామ్‌ నారాయణ్‌ దర్శకత్వం వహించనున్న ఈ చిత్రాన్ని షైన్‌ స్క్రీన్‌ బ్యానర్‌ నిర్మించనుంది. త్వరలోనే షూటింగ్‌ ప్రారంభం కానుంది.

చదవండి: కన్నబిడ్డను కాటికి పంపించాలనుకున్నా: పాకిస్తాన్‌ నటి

Videos

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

Photos

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)