Breaking News

ఆయన మాటల వల్ల ఎక్కువ నష్టపోయింది నేనే: విశ్వక్ సేన్

Published on Tue, 02/20/2024 - 06:54

యంగ్ హీరో విశ్వక్ సేన్ నుంచి వరుసగా రెండు సినిమాలు విడుదల కానున్నాయి. ఆయన ప్రధాన పాత్ర పోషించిన ప్రయోగాత్మక చిత్రం 'గామి' రిలీజ్‍కు సిద్ధమైంది. అఘోరాగా విశ్వక్ నటించిన ఈ చిత్రం మార్చి 8న విడుదల కానుంది. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి చిత్రం కూడా కొద్ది గ్యాప్‌లోనే విడుదల కానుంది. వరుస సినిమాలతో బిజీగా ఉన్న  విశ్వక్‌సేన్‌. ఒకరు చేసిన పని వల్ల తాను చాలా నష్టపోయానని ఓ ఇంటర్వ్యూలో అన్నారు.

ప్రముఖ నటుడు అర్జున్‌ దర్శకత్వంలో విశ్వక్ సేన్ సినిమా ప్రారంభమైన తర్వాత కొన్ని కారణాల వల్ల ఆగిపోయిన సంగతి తెలిసిందే. ఈ విషయం గురించి అప్పట్లో అర్జున్‌ ప్రెస్‌మీట్‌ పెట్టి విశ్వక్‌సేన్‌ కమిట్‌మెంట్‌ లేని నటుడు అంటూ కీలక వ్యాఖ్యలు చేశాడు. దీంతో టాలీవుడ్‌లో పెద్ద చర్చనీయాంశమైంది. ఆ తర్వాత విశ్వక్‌ ఈ విషయం గురించి పెద్దగా రెస్పాండ్‌ కాలేదు. కానీ తాజాగా ఓ ఇంటర్వ్యూలో అర్జున్‌ వ్యాఖ్యలపై విశ్వక్‌ ఇలా రియాక్ట్‌ అయ్యాడు.

ఇండస్ట్రీలో బ్యాక్‌గ్రౌండ్‌ ఉన్న హీరోకి ఇలానే జరిగితే ఏమయ్యేది..?  సినిమాని క్యాన్సిల్‌ చేయమని నేను ఎప్పుడూ చెప్పలేదు. కానీ కొన్ని కారణాల వల్ల ఒక్కరోజు షూటింగ్‌ మాత్రమే ఆపమని కోరాను. ఆ సమయంలో ఆయన మా ఇంటికి కూడా వచ్చారు. మా అమ్మ, నాన్నలకు విజ్ఞప్తి కూడా చేశారు. ఆ విషయాలు ఎవరికీ తెలియదు. నాకు సినిమా నేపథ్యం లేదనో, మరేదో కావచ్చు అనుకుని అనుకుని మీడియా సమావేశం పెట్టారు. కానీ ఆయన మీద గౌరవంతో దానిని మళ్లీ సాగదీయాలనుకోలేదు. ఆ అంశంపై నేను ఎందుకు సమాధానం చెప్పాలి.. ఆ అవసరం కూడా లేదు. ఆ ప్రాజెక్ట్‌కు సంబంధించి నేను తీసుకున్న రెమ్యునరేషన్‌కు రెట్టింపు తిరిగిచ్చేశాను. నాపై కోపంతో ఆయన చేసిన దానివల్ల ఎక్కువ నష్టపోయింది నేనే.' అని విశ్వక్‌ అన్నారు.

హీరోగా మరో రెండు చిత్రాలతో బిజీగా ఉన్న విశ్వక్‌.. నిర్మాతగా కూడా ఒక సినిమా తీస్తున్నారు. కానీ మార్చి 8న రానున్న గామి చిత్రంపై ఆయన ఎక్కువ ఆశలు పెట్టుకున్నారు. కొత్త దర్శకుడు విద్యాధర్‌ తెరకెక్కించిన ఈ ప్రాజెక్ట్‌ సుమారు నాలుగేళ్ల పాటు జరిగింది. ఎంతో కష్టపడి చిత్రాన్ని నిర్మించినట్లు ఆయన తెలిపారు.

Videos

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)