Breaking News

గుత్తా జ్వాలకు విడాకులు? క్లారిటీ ఇచ్చిన విష్ణు విశాల్‌

Published on Mon, 03/27/2023 - 15:07

కోలీవుడ్‌ స్టార్‌ విష్ణు విశాల్‌, బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి గుత్తా జ్వాల విడిపోతున్నారంటూ సోషల్‌ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇటీవల విష్ణు చేసిన ట్వీటే అందుకు కారణం.. 'నేను ఎంతో ప్రయత్నించాను, కానీ విఫలమవుతూనే ఉన్నాను. మరేం పర్వాలేదు.. దాని నుంచి గుణపాఠాన్ని నేర్చుకున్నాను. అయినా అది పరాజయం కాదు పూర్తిగా నా తప్పే! అది ఒక మోసపూరిత ద్రోహం..' అంటూ లైఫ్‌ లెస్సన్స్‌ హ్యాష్‌ట్యాగ్‌ జత చేశాడు. ఇది చూసిన నెటిజన్లు.. విష్ణు, జ్వాలకు మధ్య ఏదో జరిగిందని, వీరు విడాకులు తీసుకోబోతున్నారంటూ పుకారు లేపారు.

తాజాగా ఈ వ్యవహారంపై విష్ణు విశాల్‌ క్లారిటీ ఇచ్చాడు. 'కొద్దిరోజుల క్రితం నేను చేసిన ట్వీట్‌ను అతి దారుణంగా అర్థం చేసుకున్నారు. నేను నా పర్సనల్‌ లైఫ్‌ గురించి మాట్లాడలేదు. కేవలం వృత్తిగత జీవితం గురించే ట్వీట్‌ చేశాను. ఇకపోతే మా ఇద్దరికీ ఒకరంటే మరొకరికి ఎంతో నమ్మకం. ఒకరికి మనం ఇవ్వగలిగే గొప్ప బహుమతి ఏమిటంటే నమ్మకం. ఒకవేళ అలా చేయడంలో విఫలమైతే మనల్ని మనమే నిందించుకుంటాం. మన పట్ల మనం మరీ అంత కఠినంగా ఉండకూడదని మాత్రమే దానర్థం' అని చెప్పుకొచ్చాడు. మొత్తానికి ఈ ట్వీట్‌తో విడాకుల రూమర్స్‌కు చెక్‌ పెట్టాడు హీరో.

ఇకపోతే విష్ణు విశాల్‌ ప్రస్తుతం లాల్‌ సలాం సినిమా చేస్తున్నాడు. ఐశ్వర్య రజనీకాంత్‌ డైరెక్ట్‌ చేస్తున్న ఈ చిత్రంలో విక్రాంత్‌ మరో హీరోగా నటిస్తున్నాడు. ఇందులో రజనీకాంత్‌ ఓ ముఖ్య పాత్రలో కనిపించనున్నాడు. లైకా ప్రొడక్షన్స్‌ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఏఆర్‌ రెహమాన్‌ సంగీతం అందిస్తున్నాడు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)