Breaking News

రిలీజ్‌కి ముందే సినిమా లీక్‌.. నిర్మాతకు బ్లాక్‌మెయిల్‌!

Published on Sat, 02/28/2026 - 14:30

 సినిమా పరిశ్రమలో పైరసీ అనేది దశాబ్దాలుగా పరిష్కారం కాని కీలక సమస్య. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. ఏదో రకంగా సినిమా బయటకు వచ్చేస్తుంది. ఇలా థియేటర్‌లో బొమ్మ పడుతుందో లేదో అలా పైరసీ కాపీ నెట్టింట్లోకి వచ్చేస్తూ.. నిర్మాతలకు కోట్ల నష్టాన్ని తెచ్చిపెడుతుంది. అయితే ఇప్పుడిప్పుడే పైరసీ కాస్త తగ్గుతుందని భావిస్తున్న తరుణంలో టాలీవుడ్‌ హీరో శ్రీవిష్ణు షాకింగ్‌ విషయాన్ని బయటపెట్టాడు. నిన్న రిలీజ్‌ అయిన తన కొత్త సినిమా డిసెంబర్‌లోనే లీక్‌ అయిందని చెప్పి పెద్ద బాంబు పేల్చాడు. షూటింగ్‌ పూర్తి కాకముందే సినిమా లీక్‌ అయిందట. అందుకే హడావుడిగా షూటింగ్‌ పూర్తి చేసి..త్వరగా రిలీజ్‌ చేయాల్సిన వచ్చిందని శ్రీవిష్ణు చెప్పాడు.

ఆయన హీరోగా యదునాథ్ మారుతీ రావు దర్శకత్వంలో, శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుమంత్ నాయుడు జి నిర్మించిన ఈ చిత్రం ఈ శుక్రవారం(ఫిబ్రవరి 27) రిలీజ్‌ అయింది. ఈ సినిమా సక్సెస్‌ మీట్‌ని ఈ రోజు నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీవిష్ణు మాట్లాడు పైరసీ విషయాన్ని వెల్లడించాడు.

ఎలా జరిగిందో తెలియదు
‘మా సినిమాను సడెన్‌గా రిలీజ్‌ చేయడానికి గల కారణం ఏంటంటే.. డిసెంబర్‌లో ఈ సినిమాను లీక్‌ చేశారు. ఎలా జరిగిందో తెలియదు. ఓ రోజు ఉదయం నిర్మాత ఫోన్‌ చేసి చెప్పడంతో షాక్‌ అయ్యాడు. దానిపై పోలీసులకు కూడా ఫిర్యాదు చేశాం. అయినా టీమ్‌ అంతా షాక్‌లో ఉండిపోయాం. షూటింగ్‌ ఇంకా పూర్తి కాలేదు. ఏం చేయాలో అర్థం కాలేదు. ఇది బయటకు చెబితే వేరే విధంగా వెళ్తుంది. రీల్ రీల్ కోసం కూడా మా నిర్మాతని బ్లాక్ మెయిల్ చేశారు. రిలీజ్‌కి ముందు రోజు వరకు బ్లాక్‌ మెయిల్‌ చేశారు. అయినా కూడా నిర్మాత ధైర్యంగా నిలబడి ఈ సినిమాను విడుదల చేశాడు. సినిమా ప్రమోషన్‌కి మాకు కేవలం 10 రోజులు మాత్రమే దొరికింది. మొత్తానికి పైరసీ బయటకు రాకుండా చేసి ఈ సినిమాను రిలీజ్‌ చేశాం’ అని శ్రీవిష్ణు చెప్పుకొచ్చాడు.

వాట్సాప్‌ చూసి షాకయ్యా : నిర్మాత 
నిర్మాత సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ.. ఓ రోజు నాకు తెలిసిన పర్సన్‌ నాన్‌ స్టాఫ్‌గా కాల్‌ చేస్తున్నాడు. ఆ రోజు ఆదివారం. ఉదయం 9 గంటలకు నేను ఫోన్‌ లిఫ్ట్‌ చేశా. వాట్సాప్‌ చూస్కో అని చెప్పాడు. చూస్తే.. సినిమా పస్టాఫ్‌ అంతా వచ్చేసింది. ఏం చేయాలో అర్థం కాలేదు.చాలా టెన్షన్‌ పడ్డా. నా కూతురు పెళ్లి చేయాలి. కొడుకుని సెట్‌ చేయాలి. ఇదంతా నా కళ్లముందు గిర్రున తిరిగింది. కాసేపటికి గుండె నిబ్బరం చేసుకొని హైదరాబాద్‌లో ఉన్న నా కొడుకుకి ఫోన్‌ చేసి చెప్పా. ఎలా జరిగిందో ఆరా తీస్తే.. మా యూనిట్‌ నుంచే వెళ్లినట్లు తెలిసింది. లాక్‌ వేసుకోకపోవడంతో ఈ లీకేజీ జరిగింది. ఎవరు పంపారో తెలియదు కానీ.. పెద్ద డ్యామేజ్‌ జరిగింది. ఫోన్‌ నెంబర్ల ద్వారా ఎక్కడెక్కడ నుంచి వచ్చిందో తెలుసుకొని.. డిలీట్‌ చేయించాం. ఈలోపు ఛాంబర్‌లో కూడా ఫిర్యాదు చేశాం. చెన్నై నుంచి లీక్‌ అయిన విషయం తెలిసి.. అక్కడి పోలీసులకు ఫిర్యాదు చేశాం. విచారణ జరుగుతుంది. త్వరలోనే అన్ని విషయాలు బయటకు వస్తాయి’ అని అన్నారు. 

 

Videos

పెన్షన్ ఎవరిచ్చారు... జగన్ బాబు.. మంత్రి ముందే చంద్రబాబు పరువు తీసిన అవ్వ

ఇరాన్ కు అంత బలముందా.. ప్రపంచంపై యుద్ధం ప్రభావం ఏంటి?

ఈ యుద్ధం ఎక్కడ ఎందుకు మొదలైంది..

యుద్ధం ఆపేది లేదు.. ఇరాన్ డిమాండ్స్

దుబాయ్ పై ఇరాన్ బాంబుల వర్షం

మా వరకు ఎందుకు మీ ఎమ్మెల్యేలు చాలు సోషల్ మీడియాని కంపు చేయడానికి

వద్దురా అంటే వినలేదు.. వద్దురా అంటే వినలేదు.. కాకినాడ ప్రమాదం బాధితుల కన్నీటి పర్యంతం

కాకినాడ ప్రమాదంలో 22 మంది సజీవ దహనం

ఆకాశంలో అద్భుతం...మార్చి 3న రక్తంతో ఉండబోయే చంద్రుడు!

కల్తీ పాలు తాగి మనుషులు చనిపోతుంటే మీకు క్రికెట్ ఆటలు కావాలా..?

Photos

+5

వరంగల్ భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్న టాలీవుడ్ హీరోయిన్ (ఫొటోలు)

+5

లాంచనంగా మొదలైన శ్రీకాంత్ కొడుకు కొత్త సినిమా (ఫొటోలు)

+5

లుక్ మార్చేసిన శ్రీముఖి.. అందంతో మెరిసిపోతుందిగా! (ఫొటోలు)

+5

తిరుమల శ్రీవారి సేవలో హీరోయిన్ మృణాల్ (ఫొటోలు)

+5

జగద్గిరిగుట్ట నాగార్జున హైస్కూల్లో సైన్స్ ఫెస్ట్ (ఫోటోలు)

+5

విజయ్‌ పెళ్లిలో ఈషా రెబ్బ‌, తరుణ్‌ భాస్కర్‌ అట్రాక్షన్‌ (ఫోటోలు)

+5

ట్రెండింగ్ లో హీరోయిన్ త్రిష.. ఎందుకో తెలియదు (ఫొటోలు)

+5

ఉదయపూర్ ఎయిర్‌పోర్ట్‌లో సందడి చేసిన 'విరోష్‌' జోడీ (ఫొటోలు)

+5

వరంగల్‌ : నిట్‌లో ఉత్సాహంగా స్ప్రింగ్‌స్ప్రీ–2026 (ఫొటోలు)

+5

తిరుపతి ఐఐటీలో ఉత్సాహంగా తిరుత్సవ్‌–2026 (ఫొటోలు)