Breaking News

‘మోసగాళ్లు’లో కాజల్‌-విష్ణు బంధం

Published on Mon, 08/03/2020 - 19:04

సినీ ఇండస్ట్రీలో హీరో హీరోయిన్లుగా నటించిన వాళ్లు అన్నాచెల్లెళ్ల పాత్రలో నటించే పద్దతి పాత కాలంలో ఉండేది. ఈ తరం హీరోయిన్లు ఎవరూ హీరోలకు చెల్లెలుగా నటించడానికి ఆసక్తి చూపడం లేదు. అయితే టాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ కాజల్ అగర్వాల్‌‌కు హీరో మంచు విష్ణు సోదరుడిగా నటిస్తున్నారు. థ్రిల్లర్‌ మూవీగా రూపొందుతున్న ‘మోసగాళ్లు’ చిత్రంలో ఈ బంధం కనిపించనుంది. నేడు రాఖీ పూర్ణిమ సందర్భంగా ఈ విషయాన్ని చిత్ర యూనిట్‌ ప్రకటించింది. హాలీవుడ్ సినిమాటోగ్రాఫ‌ర్ షెల్డన్ చౌ ప‌నిచేస్తున్న ఈ సినిమాలో నవదీప్‌, నవీన్‌ చంద్ర,  బాలీవుడ్‌ నటుడు సునీల్‌ శెట్టి కీలక పాత్రల్లో కనిపించనున్నారు. (డైరెక్టర్‌ తేజకు కరోనా పాజిటివ్‌)

జెఫరీ గీ చిన్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను మంచు విష్ణు స్వయంగా నిర్మిస్తున్నారు. చ‌రిత్రలో న‌మోదైన అతిపెద్ద ఐటీ స్కామ్ నేప‌థ్యంలో తెరకెక్కుతున్న ‘మోస‌గాళ్లు’ మూవీకి సంబంధించి ప్రస్తుతం పోస్ట్ ప్రొడ‌క్షన్ ప‌నులు జ‌రుగుతున్నాయి. ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌ను కాజల్‌ పుట్టిన రోజు సందర్భంగా ఇటీవల మూవీ యూనిట్‌ విడుదల చేసింది. ఈ పోస్టర్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా ఈ వేస‌విలో ‘మోస‌గాళ్ళు’ విడుద‌ల కావాల్సి ఉండ‌గా, క‌రోనా మ‌హ‌మ్మారి వ్యాప్తి కార‌ణంగా విధించిన లాక్‌డౌన్‌తో విడుద‌ల తేదీ వాయిదాప‌డింది. అయితే ఈ ఏడాది చివర్లో విడుదల చేయాలని మేకర్స్‌ ఆలోచిస్తున్నారు. (రాఖీ: చెల్లెళ్లతో చిరంజీవి.. వీడియో వైరల్‌)

Videos

మహిళల సింధూరాన్ని చెరిపినవారిని మట్టిలో కలిపేశాం : మోదీ

మెడికల్ మాఫియా బాగోతం! ఫేక్ డాక్టర్ల మాయాజాలం

ఇజ్రాయెల్ వర్సెస్ ఇరాన్ Conflict 2025

Rain Alert: మరో నాలుగు రోజుల పాటు రాష్ట్రంలో వర్షాలు

KTR: నీ కేసులకు భయపడేది లేదు

రేషన్ డోర్ డెలివరీ రద్దుపై వైఎస్ జగన్ రియాక్షన్..

రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి కొండా రాజీవ్

Operation Trashi: టాప్ 6 ఉగ్రవాదులు హతం..

MLAని అని చెప్పుకోవాలంటే సిగ్గుగా ఉంది: Bandaru Satyanarayana

తమిళనాడు లిక్కర్ స్కామ్ కేసు దర్యాప్తుపై సుప్రీంకోర్టు స్టే

Photos

+5

కొడుకు, చెల్లెలితో సానియా మీర్జా క్యూట్‌ మూమెంట్స్‌ (ఫొటోలు)

+5

Miss World 2025 : శిల్పారామంలో ఆడి పాడుతూ సందడి చేసిన గ్లోబల్‌ బ్యూటీలు (ఫొటోలు)

+5

లిక్కర్‌ స్కాం.. బాబు బేతాళ కథలు.. జగన్‌ ధ్వజం (చిత్రాలు)

+5

అనసూయ ఇంట మరో శుభకార్యం.. పెద్ద కుమారుడితో సంప్రదాయ వేడుక (ఫొటోలు)

+5

HHVM మూవీ ఈవెంట్‌లో మెరిసిన హీరోయిన్ నిధి అగర్వాల్ (ఫొటోలు)

+5

Cannes 2025 : ‘సింధూరం’తో మెరిసిన ఐశ్వర్య (ఫోటోలు)

+5

ప్రసాద్ ఐమ్యాక్స్‌ : ‘రానా నాయుడు సీజన్-2’ టీజర్‌ ఈవెంట్‌ రానా సందడి (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో దంచికొడుతున్న వర్షం..భారీగా ట్రాఫిక్ జామ్ (ఫొటోలు)

+5

హనుమాన్‌‌ జయంతి .. జనసంద్రంగా కొండగట్టు అంజన్న క్షేత్రం (ఫొటోలు)

+5

విజయ్‌ సేతుపతి 'ఏస్‌' మూవీ ప్రీరిలీజ్‌ వేడుక (ఫొటోలు)