Breaking News

కొత్త సినిమా ప్రకటించిన విశాల్‌, హీరోయిన్‌ ఎవరంటే?

Published on Sun, 07/16/2023 - 09:48

హీరో విశాల్‌ ఇటీవల వరుసగా చిత్రాలు చేసుకుంటూ పోతున్నారు. ఈయన తాజాగా నటించిన చిత్రం మార్క్‌ ఆంటోని. నటి రీతూ వర్మ నాయకిగా, ఎస్‌జే సూర్య ప్రతినాయకుడిగా నటించిన ఈ చిత్రానికి ఆధిక్‌ రవిచంద్రన్‌ దర్శకుడు. షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ చిత్రం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఇందులో విశాల్‌ ఒక పాటను పాడటం విశేషం. ఈ చిత్రం సెప్టెంబర్‌లో విడుదలకు సిద్ధం అవుతోంది. దీంతో పాటు తుప్పరివాలన్‌–2 చిత్రాన్ని చేస్తున్నారు.

కాగా విశాల్‌ తన తదుపరి చిత్రానికి సిద్ధమయ్యారు. ఇది ఆయన నటించే 34వ చిత్రం. ఈ చిత్రానికి కమర్షియల్‌ దర్శకుడు హరి దర్శకత్వం వహిస్తున్నారు. దీన్ని దర్శకుడు కార్తీక్‌ సుబ్బరాజ్‌ స్టోన్‌ బెంచ్‌ స్టూడియో, జి స్టూడియోస్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. దీనికి దేవి శ్రీ ప్రసాద్‌ సంగీతాన్ని అందిస్తున్నారు. ఇంతకుముందు ఈయన హరి సింగం 1, 2, వేంగై చిత్రాలకు దర్శకత్వం వహించారు. కాగా విశాల్‌, దర్శకుడు హరి కాంబోలో ఇంతకుముందు తామరభరణి, పూజై వంటి హిట్‌ చిత్రాలు రూపొందాయి.

తాజాగా ఈ కాంబోలో రూపొందుతున్న మూడవ చిత్రం శనివారం పూజ కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఈ విషయాన్ని నటుడు విశాల్‌ తన ట్విటర్‌ ద్వారా వెల్లడించారు ఇందులో నటి ప్రియా భవానీ శంకర్‌ నాయకిగా నటించనున్నట్లు, నటుడు యోగిబాబు తదితరులు ముఖ్య పాత్రలు పోషించనున్నట్లు సమాచారం. చిత్ర షూటింగ్‌ను తమిళనాడు, కేరళ, ఆంధ్ర ప్రదేశ్‌ పరిసర ప్రాంతాల్లో నిర్వహించనున్నట్లు సమాచారం. ఫుల్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ కథాచిత్రంగా రూపొందుతున్న ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెల్లడించే అవకాశం ఉంది.

చదవండి: నిత్యామీనన్‌ ఇంట్లో విషాదం

Videos

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

భలే పడ్డారు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో

రోడ్డుపై స్కూటర్ ఆపి.. హెల్మెట్ తో దాడి..! మాజీ ఎమ్మెల్యే రౌడీయిజం వైరల్

ప్లాన్ "B" లోడింగ్..! కొండా సురేఖ సంచలన పోస్ట్

ఒంటరైన గంభీర్ రోహిత్ కోసం రెండుగా చీలిన బీసీసీఐ

DSCపై కొండారెడ్డి బురుజు దగ్గర ప్రభాకర్ తో కలిసి చర్చకి సిద్ధమా లోకేష్ ?

సంక్షోభంలో ఫోక్స్ వ్యాగన్.. మరో 50 వేల ఉద్యోగాలకు కోత

ట్రంప్ కు దిమ్మతిరిగే షాక్.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ ఆర్డర్ కు కోర్టు బ్రేక్!

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు