పబ్లిక్‌ రివ్యూలను అనుమతించొద్దు: విశాల్‌ విజ్ఞప్తి

Published on Fri, 07/18/2025 - 14:32

సాక్షి, చెన్నై: శ్రీ కాళికాంబాళ్‌ పిక్చర్స్‌ పతాకంపై కె.మాణిక్యం నిర్మించిన చిత్రం రెడ్‌ ఫ్లవర్‌. నటుడు విగ్నేష్‌ కథానాయకుడిగా నటించిన ఇందులో మనీషా జాహ్నవి నాయకిగా నటించారు. వైజీ.మహేంద్రన్‌, జాన్‌విజయ్‌, తలైవాసల్‌ విజయ్‌, అజయ్‌రత్నం ముఖ్యపాత్రలు పోషించారు. ఈ చిత్రానికి ఆండ్రూపాండియన్‌ కథ, దర్శకత్వం బాధ్యతలను నిర్వహించారు. కె.దేవసూర్య చాయాగ్రహణం, సంతోష్‌రామ్‌ సంగీతాన్ని అందించారు. ఈ చిత్రం ఆగస్టు 8న తెరపైకి రానుంది. చిత్ర ఆడియో ట్రైలర్‌ విడుదల కార్యక్రమాన్ని బుధవారం చైన్నె, వడపళనిలోని కమలా థియేటర్లో నిర్వహించారు. 

ఇందులో విశాల్‌, పి.వాసు, స్వరాజ్‌, ఫైవ్‌ స్టార్‌ కదిరేశన్‌ చిత్ర ఆడియోను ఆవిష్కరించారు. నిర్మాత మాణిక్యం మాట్లాడుతూ ఇది ప్రేమ కథ చిత్రం మాత్రమే కాదని మన దేశ ఉన్నతిని చాటే చిత్రంగా ఉంటుందని చెప్పారు. విశాల్‌ మాట్లాడుతూ 2025లో జరిగే కథలను చిత్రాలుగా తీయడానికే పలువురు దర్శకులు తడబడుతున్నారని అలాంటిది ఈచిత్ర దర్శకుడు ఆండ్రు 2047లో ఏం జరగనుంది అనే విషయాన్ని తెరపై ఆవిష్కరించారని అన్నారు. 

నేతాజీకి ఈ చిత్రాన్ని అంకితం ఇవ్వడం సంతోషంగా ఉందని అన్నారు. ఈ సందర్భంగా థియేటర్ల యాజమాన్యానికి తాను ఒక విజ్ఞప్తి చేస్తున్నానని, థియేటర్లో చిత్రాలు విడుదలైన మూడు రోజుల వరకు పబ్లిక్‌ రివ్యూలను అనుమతించరాదని పేర్కొన్నారు. అదేవిధంగా నిర్మాతల సంఘం చిత్రాల రిలీజ్‌ను కట్టడి చేయాలని తెలిపారు.

 

Videos

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

బరితెగింపు అంటే ఇదే.. నామినేషన్ తొలి రోజే తెగబడ్డ నారా గొడ్డలి

YSRCP రెండో జాబితా.. మేయర్ అభ్యర్థులు వీరే..!

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)