Breaking News

ఆస్తి వివరాలు కోర్టుకు సమర్పించిన విశాల్‌

Published on Tue, 09/26/2023 - 07:41

హీరో విశాల్‌ తన ఆస్తులు, బ్యాంకు ఖాతాల వివరాలను కోర్టులో సమర్పించారు. దీనికి సంబంధించిన వివరాలను చూస్తే నటుడు విశాల్‌ ఫైనాన్షియర్‌ అన్బచెలియన్‌ వద్ద తీసుకున్న రూ.21.29 కోట్ల రుణాన్న లైకా సంస్థ చెల్లించింది. అందుకు గానూ విశాల్‌ నిర్మించే చిత్రాల హక్కులను తమకు చెందే విధంగా ఒప్పందం కుదుర్చుకున్నారు. అయితే విశాల్‌ కథానాయకుడిగా నటించి, నిర్మించిన వీరమే వాగై చుడుమ్‌ చిత్ర విడుదల హక్కులను లైకాకు బదులుగా వేరే సంస్థకు విక్రయించారు. దీంతో లైకా సంస్థ చైన్నె హైకోర్టును ఆశ్రయించింది.

ఈ కేసుపై చైన్నె హైకోర్టు ప్రత్యేక న్యాయస్థానంలో పలు మార్లు విచారణ జరిగింది. గత 12వ తేదీన ఈ కేసును విచారించిన న్యాయమూర్తి పీటీ ఉషా విశాల్‌ను తన స్థిరాస్తులు, బ్యాంక్‌ ఖాతాల వివరాలను కోర్టుకు సమర్పించాలని ఆదేశించించారు. కానీ ఈ ఆదేశాలను పాటించకపోవడంతో గత 19వ తేదీన జరిగిన విచారణ సమయంలో దీన్ని కోర్టు ధిక్కరణ కింద పరిగణించాల్సి ఉంటుందని హెచ్చరించారు. కాగా ఈ కేసు సోమవారం మరోసారి విచారణకు వచ్చింది.

ఈ సందర్భంగా విశాల్‌ తన ఆస్తుల వివరాలను కోర్టుకు అందించారు. అందులో స్టాండర్డ్‌ చార్టెడ్‌, ఐడిబీఐ, యాక్సెస్‌, హెచ్‌ డీ ఎఫ్‌ సీ, బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా తదితర బ్యాంకుల్లోని తన ఖాతాల వివరాలను పొందుపరిచారు. అయితే ఆ వివరాలు పూర్తిగా లేకపోవడంతో రిట్‌ పిటిషన్‌ దాఖలు చేయాల్సిందిగా లైకా సంస్థను ఆదేశించిన న్యాయమూర్తి తదుపరి విచారణను ఈనెల 26కు వాయిదా వేశారు.

చదవండి: ఎట్టకేలకు ఓటీటీలోకి వచ్చేస్తున్న చిత్రం.. స్ట్రీమింగ్‌ ఎక్కడంటే?

Videos

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)