Breaking News

టార్గెట్‌ ఫిక్స్‌.. రాజకీయాల్లోకి వస్తున్నట్లు ప్రకటించిన విశాల్‌

Published on Sun, 04/14/2024 - 16:52

తమళనాడులో పొలిటికల్‌ ఎంట్రీపై హీరో విశాల్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. సౌత్‌ ఇండియాలో టాప్‌ హీరో లిస్ట్‌లో ఉన్న విశాల్‌ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తారని చాలా ఏళ్లుగా వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో చెన్నైలో ఓ ప్రెస్‌మీట్‌లో పాల్గొన్న విశాల్‌ రాజకీయ ప్రకటన చేశారు.

తమిళనాడులో కొత్త పార్టీని స్థాపించి 2026 అసెంబ్లీ ఎన్నికల్లో తప్పకుండా పోటీ చేస్తానని ఆయన ప్రకటించారు. సరైన వసతులు లేకపోవడంతో రాష్ట్రంలోని ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. అలాంటి వారందరికీ సేవ చేయడంతో పాటు అన్ని రకాల సౌకర్యాలు కల్పించడమే తన ఉద్దేశం అని.. ఈ కారణంతోనే తాను రాజకీయాల్లోకి వస్తున్నట్లు విశాల్‌ పేర్కొన్నారు.

ఇదే సమయంలో మరో రాజకీయ పార్టీతో పొత్తు పెట్టుకునే అవకాశం ఉందా..? అని ప్రశ్నించగా..  అందుకు ఆయన నో  అని చెప్పారు. ముందుగా ప్రజల్లో తాను ఏంటో నిరూపించుకోవాలని తెలిపారు. ఆ తర్వాతే ఎన్నికల పొత్తు గురించి ఆలోచిస్తానని అన్నారు. విజయ్‌ తర్వాత విశాల్‌ కూడా రాజకీయ ఎంట్రీ ఇవ్వనున్నట్లు ప్రకటన రావడంతో ఈ టాపిక్‌ ఇప్పుడు తమిళనాట భారీ చర్చలకు దారితీసింది.

తమిళనాడులో విశాల్‌ ఇప్పటికే పలు సేవా కార్యక్రమాలు ప్రారంభించారు. ఈ క్రమంలో తన అమ్మగారి పేరు మీద నెలకొల్పిన ‘దేవి ఫౌండేషన్‌’తో ఎంతోమంది నిరుపేద విద్యార్థులకు, బాధిత రైతులకు సాయం చేస్తున్నారు. షూటింగ్‌లకు వెళ్లినప్పుడు అక్కడి ప్రజల కష్టాలు, అవసరాలను అడిగి తెలుసుకుని వారందరికీ తగిన సాయం చేస్తూ వస్తున్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రజల కష్టాలను తెలుసుకుంటూ వారందరికీ తన చేతనైనంత సాయం చేస్తూ విశాల్‌ వార్తల్లో నిలుస్తూ వచ్చిన విషయం తెలిసిందే.

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)