Breaking News

సాయిధన్సికతో విశాల్‌ పెళ్లి.. ఏజ్‌ గ్యాప్‌ ఎంతంటే?

Published on Sat, 08/30/2025 - 15:43

కోలీవుడ్‌ స్టార్‌ హీరో విశాల్‌ త్వరలోనే తన బ్యాచిలర్‌ జీవితానికి శుభం కార్డు వేయబోతున్నాడు. తన పుట్టిన రోజు సందర్భంగా ఆగస్టు 29న హీరోయిన్‌ సాయి ధన్సికతో ఎంగేజ్‌మెంట్‌ చేసుకున్నాడు. చెన్నైలో జరిగిన ఈ నిశ్చితార్థ వేడుకకు ఇరువురి కుటుంబ సభ్యులు మాత్రమే హాజరయ్యారు.

(చదవండి: ఇదే నా లాస్ట్‌ బ్యాచిలర్‌ బర్త్‌డే.. ఇకపై ముద్దు సన్నివేశాల్లో నటించను)

 సాయి ధన్సిక, విశాల్‌ కలిసి ఒక్క సినిమా చేయలేదు కానీ.. గత కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్నారు. ఇటీవల ఓ సినిమా ఈవెంట్‌లో సాయి ధన్సికనే తమ ప్రేమ విషయాన్ని బహిర్గతం చేసింది. త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నామనే విషయాన్ని కూడా అప్పుడే చెప్పింది. అయితే విశాల్‌ మాత్రం సడెన్‌గా ఎంగేజ్‌మెంట్‌ చేసుకొని అందరికి షాకిచ్చాడు.

ఏజ్‌ గ్యాప్‌పై చర్చ
విశాల్‌తో ప్రేమలో ఉన్నానని సాయి ధన్సిక ప్రకటించిన వెంటనే వీరిద్దరి మధ్య ఉన్న వయసు తేడాపై నెటిజన్స్‌ ఆరా తీశారు. తాజాగా ఎంగేజ్‌మెంట్‌ చేసుకోవడంతో మరోసారి ‘ఏజ్‌ గ్యాప్‌’పై నెట్టింట చర్చ మొదలైంది. విశాల్‌కి నిన్నటితో 48 ఏళ్లు నిండాయి. 1977 ఆగస్టు 29న విశాల్‌ జన్మించాడు. ఇక సాయి ధన్సిక  1989 సెప్టెంబర్‌ 20న జన్మించింది. ప్రస్తుతం ఆమె వయసు 35 ఏళ్లు. ఈ లెక్కన వీరిద్దరి మధ్య దాదాపు 13 ఏళ్ల​ ఏజ్‌ గ్యాప్‌ ఉంది. విశాల్‌ కంటే సాయి ధన్సిక అంత చిన్నదా అని నెటిజన్స్‌ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

అప్పుడే పెళ్లి.. ?
నడిగర్‌ సంఘం భవనం పూర్తయిన తర్వాతే పెళ్లి చేసుకుంటానని గతంలో విశాల్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ మాటకు కట్టుబడే విశాల్‌ ఇన్నాళ్లు పెళ్లి చేసుకోకుండా ఉండిపోయాడు. ఇప్పుడు నడిగర్‌ భవనం దాదాపు పూర్తయినట్లే. అన్ని పనులు అయిపోతే.. తన బర్త్‌డే రోజే పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. కానీ ఇంకా రెండు నెలల పని పెండింగ్‌లో ఉందట. అందుకే బర్త్‌డేకి ఎంగేజ్‌మెంట్‌ చేసుకొని ఆగిపోయాడు. రెండు నెలల తర్వాత నడిగర్‌ సంఘం భవనంలోనే విశాల్‌ పెళ్లి చేసుకోబోతున్నాడు. ఈ విషయాన్ని స్వయంగా విశాలే ప్రకటించాడు. సాయి ధన్సిక సినీ విషయానికొస్తే .. ‘కబాలి’ సినిమాలో రజనీకాంత్‌ కూతురి గా నటించి మెప్పించింది. ‘షికారు’ సినిమాతో టాలీవుడ్కు పరిచయమైంది. ‘అంతిమ తీర్పు’, ‘దక్షిణ’ సినిమాల్లోనూ హీరోయిన్‌గా నటించింది. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)