Breaking News

20 ఏళ్ల తర్వాత కమల్‌ హాసన్‌తో నటిస్తున్న హీరోయిన్‌

Published on Thu, 11/23/2023 - 14:21

విశ్వనటుడు కమల్‌ హాసన్‌ నటించిన విరుమాండి చిత్రాన్ని సినీ ప్రియులు ఎ‍ప్పటికీ మరచిపోలేరు. అందులో కమల్‌ హాసన్‌కు జంటగా నటించిన హీరోయిన్‌ అభిరామిని మర్చిపోలేరు. ఈ సినిమాతో ఈ జంట అంతగా పాపులర్‌ అయ్యారు. విరుమాండి చిత్రం 2004లో విడుదలైంది. ఇకపోతే కమల్‌ హాసన్‌ నాయగన్‌ వంటి సెన్సేషనల్‌ హిట్‌ చిత్రం తరువాత మరోసారి మణిరత్నం దర్శకత్వంలో నటించడానికి సిద్ధమైన విషయం తెలిసిందే. దీనికి థగ్‌ లైఫ్‌ అనే టైటిల్‌ను కూడా ఖరారు చేశారు.

ఈ భారీ చిత్రాన్ని రెడ్‌ జెయింట్‌ మూవీస్, రాజ్‌కమల్‌ ఫిలిం ఇంటర్నేషనల్, మద్రాస్‌ టాకీస్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇందులో హీరోయిన్‌ త్రిష, నటుడు జయంరవి, దుల్కర్‌ సల్మాన్‌ వంటి స్టార్స్‌ ముఖ్యపాత్రను పోషించనున్నట్లు ఇప్పటికే చిత్ర వర్గాలు అధికారికంగా ప్రకటించాయి. తాజాగా ఇందులో నటి అభిరామి వచ్చి చేరుతున్నారు. దీని గురించి ఆమె ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.


విరుమాండి సినిమాలో ఓ సన్నివేశం ఫోటో

తాను కమల్‌ హాసన్‌కు జంటగా నటించిన విరుమాండి చిత్రం విడుదలై 20 ఏళ్లు అయిందన్నారు. మళ్లీ ఇప్పుడు థగ్‌ లైప్‌ చిత్రంలో ఆయనతో కలిసి నటించడం సంతోషంగా ఉందన్నారు. ఇందులో తన పాత్ర గురించి దర్శక నిర్మాతలే ప్రకటిస్తారని అన్నారు. మరో విశేషం ఏమిటంటే విరుమాండి చిత్రం 2004లో పొంగల్‌ సందర్భంగా విడుదలైందని, ఇప్పుడు థగ్‌ లైప్‌ చిత్రం షూటింగ్‌ 2024 పొంగల్‌ సందర్భంగా ప్రారంభం కాబోతుందని అభిరామి పేర్కొన్నారు. కాగా ఏఆర్‌ రెహమాన్‌ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌లుక్, ప్రోమో ఇటీవలే రిలీజై అందరినీ ఆకట్టుకుంది.

చదవండి: ఉన్నదంతా పోయింది.. అప్పులపాలయ్యా.. దివాలా తీశానంటున్న రైతుగా మారిన నటుడు

Videos

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినా నో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)