గ్రాండ్‌గా విరోష్‌ పెళ్లి.. విజయ్‌ దేవరకొండకు భారీ కట్నకానుకలు?

Published on Thu, 02/26/2026 - 17:28

టాలీవుడ్ పవర్ కపుల్ విజయ్ దేవరకొండ , రష్మిక మందన్న చుట్టూ ఇప్పుడు భారీ హైప్ నడుస్తోంది. ఈ ప్రేమ జంట పెళ్లి ఈ రోజు(ఫిబ్రవరి 26) ఉదయం ఉదయపూర్‌లో ఘనంగా జరిగింది. ఈ నేపథ్యంలో కట్న, కానులకు సంబంధించి పలు గాసిప్‌ వార్తలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. విజయ్ రష్మిక నుంచి భారీ కట్నం తీసుకుంటున్నాడనే విషయం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఈ రూమర్స్ నిజమా? లేక ఓవర్ హైప్‌నా?

విజయ్ దేవరకొండ , రష్మిక మందన్న 'గీతా గోవిందం', 'డియర్ కామ్రేడ్' సినిమాల్లో కలిసి నటించారు. అప్పటి నుంచి వీళ్ల మధ్య లింకప్ రూమర్స్ స్టార్ట్ అయ్యాయి. 2025 అక్టోబర్‌లో హైదరాబాద్‌లో సీక్రెట్ ఎంగేజ్‌మెంట్ జరిగిందని సోర్సెస్ చెబుతున్నాయి. కానీ ఇద్దరూ ఓపెన్‌గా కన్ఫర్మ్ చేయలేదు. ఇప్పుడు వెడ్డింగ్ హడావిడి బాగా వైరల్ అవుతోంది. ముఖ్యంగా ఈ వెడ్డింగ్ డీటైల్స్ నెటిజెన్స్ ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.ఫిబ్రవరి 26న ఉదయపూర్‌లోని ఒక హెరిటేజ్ ప్యాలెస్‌లో  వీరిద్దరి వివాహం జరిగింది. మార్చి 4న హైదరాబాద్‌లో గ్రాండ్ రిసెప్షన్ ఉంటుందని చెబుతున్నారు. ఈ వెడ్డింగ్‌ను 'విరోష్ వెడ్డింగ్' అని పిలుస్తున్నారు . ఇక్కడ విరోష్ అంటే విజయ్ + రష్మిక = విరోష్ అని అర్ధం.

ఇకపోతే వీళ్ళ పెళ్ళి వార్తల్లో  మెయిన్ కాంట్రవర్సీ డౌరీ క్లెయిమ్స్! సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న రూమర్స్ ప్రకారం, రష్మిక సైడ్ నుంచి విజయ్‌కు భారీ డౌరీ ఇస్తున్నారని... గోల్డ్, లగ్జరీ ప్రాపర్టీలు, ఇండియాలో హై-ఎండ్ హోమ్స్, కార్లు, క్యాష్ వంటివి ఉన్నాయని చెబుతున్నారు. కొన్ని పోస్టుల్లో "150 కోట్ల డౌరీ" అని కూడా రాస్తున్నారు! ఇది 'బిగ్ ఫ్యాట్ వెడ్డింగ్' అని, టాలీవుడ్‌లో ఎప్పుడూ లేనంత గ్రాండ్‌గా జరగబోతోందని ట్రెండ్ అవుతోంది.

కానీ ఈ క్లెయిమ్స్ ఎంత వరకు నిజం? చాలా ముఖ్యంగా – ఇవన్నీ *అన్‌వెరిఫైడ్* అలాగే *వైరల్ రూమర్స్* మాత్రమే! విజయ్ లేదా రష్మిక ఎవరూ ఈ డౌరీ గురించి కాదు కదా కనీసం వాళ్ళ పెళ్ళి గురించి కూడా ఇప్పటిదాకా ఒక్క మాట కూడా మాట్లాడలేదు. డౌరీ అనేది చట్టవిరుద్ధం,  ఈ రకమైన రూమర్స్ సెలబ్రిటీల చుట్టూ తరచూ వస్తాయి – కొన్ని ట్రోల్స్, కొన్ని ఫేక్ న్యూస్ కోసం. గతంలో కూడా ఫిబ్రవరి 2 లేదా ఇతర డేట్స్‌పై ఫేక్ వీడియోలు వచ్చాయి, కానీ అవి తప్పు అని తేలాయి.

ఈ కట్నకానుకలతో పాటు ఇంకా కొన్ని హాట్ రూమర్స్ హల్ చల్ చేస్తున్నాయి. నెట్‌ఫ్లిక్స్ వీళ్ల వెడ్డింగ్ స్ట్రీమింగ్ రైట్స్ కోసం  రూ. 260 కోట్లు కూడా ఆఫర్ చేసిందని, కానీ విజయ్ రిజెక్ట్ చేశాడని చెబుతున్నారు .ఎందుకంటే తమ వెడ్డింగ్ మెమరీస్ పర్సనల్ అని వాటిని పబ్లిక్ డొమైన్ లో ఉంచడం తమకు ఇష్టంలేదని విజయ్ చెప్పాడట. అంతేకాదు ఈ పెళ్ళికి సంబంధించి సెక్యూరిటీ టీమ్ 3 వారాలు ట్రైనింగ్ తీసుకుందని, స్టార్ గెస్ట్స్ లిస్ట్ భారీగా ఉందని కూడా లీక్ అయ్యాయి.  అయితే పెళ్లి గురించి అయితే కొంతవరకు ఓకే కాసీ  డౌరీ లాంటి సెన్సిటివ్ టాపిక్స్‌పై కూడా రూమర్స్ వ్యాప్తి చేయడం మంచిది కాదు.

Videos

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)