రష్మికకు మూడోసారి.. విజయ్‌కు మాత్రం తొలిసారి!

Published on Wed, 02/25/2026 - 18:06

సినిమాలు, పనులు ఎప్పుడూ ఉండేవే.. కానీ పెళ్లి జీవితంలో ఒక్కసారే వస్తుంది. కల్యాణం వచ్చినా ఆగదు, కక్కొచ్చినా ఆగదన్నట్లు ఆ శుభఘడియలు ముంచుకొచ్చాక ఎవరూ దాన్ని వాయిదా వేయలేరు. టాలీవుడ్‌ సెలబ్రిటీ కపుల్‌ విజయ్‌ దేవరకొండ, రష్మిక మందన్నా విషయంలో ఇదే జరుగుతోంది. చాలాకాలంగా ప్రేమలో ఉన్న వీరిద్దరూ దాన్ని బయటకు చెప్పకుండా దాగుడుమూతలు ఆడుతున్నారు.

ఇప్పుడు ఆ ఆటకు ముగింపు పలుకుతూ భార్యాభర్తలుగా ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఫిబ్రవరి 26న విరోష్‌ (విజయ్‌- రష్మిక) పెళ్లి జరగనుంది. ఇప్పటికే ప్రీవెడ్డింగ్‌ సెలబ్రేషన్స్‌ మొదలయ్యాయి. తాజాగా జరిగిన సంగీత్‌ వేడుకలో విజయ్‌ తల్లి మాధవి.. వారసత్వంగా వస్తున్న బంగారు గాజులను రష్మికకు బహుకరించి తన ప్రేమను చాటుకున్నట్లుృ తెలుస్తోంది. మరి విరోష్‌ లవ్‌ స్టోరీ ఎప్పుడు? ఎలా? మొదలైందో ఓసారి చూసేద్దాం..

2018లోనే పెళ్లి
గీత గోవిందం.. 2018లో వచ్చిన ఈ సినిమాలో తొలిసారి విజయ్‌- రష్మిక జంటగా నటించారు. ఆన్‌ స్క్రీన్‌లో పెళ్లి కూడా చేసుకున్నారు. ఇలా పెళ్లి సీన్‌లో నటించడం రష్మికకు మూడోసారి కానీ విజయ్‌కు మాత్రం అదే తొలిసారి కావడం విశేషం! ఈ చిత్రంతోనే వీరి మధ్య పరిచయం మొదలైంది. డియర్‌ కామ్రేడ్‌ మూవీతో స్నేహం కాస్త ప్రేమగా మారింది. అందుకే ఈ మూవీ తమకెంతో స్పెషల్‌ అంటుంటారు. కానీ ప్రేమలో ఉన్నామని మాత్రం నేరుగా ఎన్నడూ చెప్పలేదు. 

అందరి ముందు..
కలిసి విహారయాత్రలకు వెళ్లినప్పుడు కూడా జంటగా ఫోటోలు షేర్‌ చేసిందీ లేదు. అయితే ఇద్దరూ కలిసే ఉన్నట్లుగా హింట్లు మాత్రం వదిలేవారు. పుష్ప సినిమా సమయంలో విజయ్‌ను డార్లింగ్‌ ఫ్రెండ్‌ అని అభివర్ణించింది రష్‌. ఇంటర్వ్యూలలో కూడా అతడు తన ఫేవరెట్‌ అని వెల్లడించింది. ది గర్ల్‌ఫ్రెండ్‌ ఈవెంట్‌లో తొలిసారి విజయ్‌.. అందరిముందు రష్మిక చేయిని ముద్దాడాడు. దీంతో ఆమె సిగ్గుల మొగ్గయింది.

ఆ ఒక్క మాటతో..
జయాపజయాల్లోనూ ఒకరికి ఒకరు తోడుగా ఉన్నారు. పలు బాక్సాఫీస్‌ ఫెయిల్యూర్స్‌ తర్వాత విజయ్‌.. కింగ్డమ్‌తో పాజిటివ్‌ టాక్‌ తెచ్చుకుంటే చిన్నపిల్లలా సంబరపడిపోయింది నేషనల్‌ క్రష్‌. మనం హిట్‌ కొట్టాం అని మురిసిపోయింది. తన ప్రేమ విజయ్‌ దగ్గరే ఆగిపోలేదు, అతడి కుటుంబాన్ని కూడా తన కుటుంబంగా భావించింది. విజయ్‌ సోదరుడు ఆనంద్‌ దేవరకొండ సినిమా ఈవెంట్స్‌కు వెళ్లేందుకు ఏనాడూ నో చెప్పలేదు. అటు విజయ్‌ తల్లితోనూ తనకు ప్రత్యేక అనుబంధం ఉంది. ఆమె తనకు అమ్మ తర్వాత అమ్మతో సమానం అన్నప్పుడే ఆమె తెలుగింటి కోడలైపోయింది.

పెళ్లి పత్రికలోనూ..
విజయ్‌- రష్మికల ప్రేమను చూసిన అభిమానులు వీరికి విరోష్‌ (#Viorsh) అనే ట్యాగ్‌ ఇచ్చారు. అలానే పిలవడం మొదలుపెట్టారు. అభిమానులు ఇచ్చిన విరోష్‌ అనే పేరు ఈ లవ్‌బర్డ్స్‌కు సైతం నచ్చడంతో పెళ్లి పత్రికలోనూ అదే పేరు అచ్చువేయించారు. మరికొన్ని గంటల్లో ఒక్కటి కాబోతున్న ఈ విరోష్‌ జంటకు అడ్వాన్స్‌ కంగ్రాచ్యులేషన్స్‌!!

చదవండి: పెళ్లి వేళ.. రష్మిక వ్యాఖ్యలు వైరల్‌

Videos

ఎప్ స్టీన్ కేసులో కొత్త ట్విస్ట్.. ట్రంప్ ఫైళ్లు మాయం?

ఒక నిష్ట దరిద్రుడివి.. పవన్ పై జడ శ్రవణ్ సంచలన కామెంట్స్

నిన్ను చూసి ఊసరవెల్లి కూడా ఉరేసుకుంటుంది.. పవన్ పై తాటిపర్తి ఫైర్

బాబుకు దెబ్బ మీద దెబ్బ

రాజంపేట లాడ్జిలో భారీ అగ్నిప్రమాదం.. ఒకరి మృతి

ఐటీ ఉద్యోగులకు బిగ్ షాక్.. కోడింగ్ రాసేది, ఎగ్జిక్యూట్ చేసేది అంతా AI

హైందవ ద్రోహి.. సాక్షాత్తూ ఆ దేవదేవుడే బయటపెట్టిన సాక్ష్యం

ఉదయపూర్ లో విరోష్ పెళ్లి హంగామా

బంగారం, వెండి కొనాలనుకునేవారికి షాక్.. ఇవాళ ధరలు ఎలా ఉన్నాయంటే..!

నందమూరి బాలయ్య కోసం నారా బావయ్య నిర్వాకం

Photos

+5

’విష్ణు విన్యాసం‘ సినిమా ప్రీ రిలీజ్ (ఫొటోలు)

+5

ప్రియురాలితో బిగ్‌బాస్ షణ్ముఖ్ ఎంగేజ్‌మెంట్‌ (ఫోటోలు)

+5

కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి బంధువుల పెళ్లిలో మెరిసిన అల్లు స్నేహారెడ్డి (ఫోటోలు)

+5

విజయ్ దేవరకొండ-రష్మిక పెళ్లి సందడి విశేషాలు (ఫొటోలు)

+5

కుంభాభిషేక మహోత్సవంలో వైఎస్‌ జగన్‌ (ఫొటోలు)

+5

బ్లాక్ అండ్ బ్లాక్‌లో మెరిసిపోతున్న శిరీష్-నయనిక (ఫొటోలు)

+5

నందిపల్లిలో వైఎస్‌ జగన్‌ పర్యటనతో పండుగ వాతావరణం (ఫొటోలు)

+5

Telangana Inter Exams : ఇంటర్ పరీక్షలు ప్రారంభం (ఫొటోలు)

+5

శ్రీదేవి 'బ్యాండ్ మేళం' టీజర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

వైఎస్‌ జగన్‌ పులివెందుల పర్యటన (ఫోటోలు)