డబ్బు కోసం నెగటివ్‌ రివ్యూ.. యూట్యూబర్‌పై కేసు

Published on Fri, 07/18/2025 - 07:22

సినిమా రివ్యూల విషయంలో ఎప్పుడూ వివాదం, ఆంక్షలు కనిపిస్తూనే ఉంటాయి. అయితే, తాజాగా ఒక యూట్యూబర్‌పై సినీ నిర్మాత ఫిర్యాదు చేశారు. తనను డబ్బు డిమాండ్‌ చేశాడని, ఇవ్వకుంటే తన సినిమాకు నెగిటివ్ రివ్యూ ఇస్తానని చెప్పినట్లు పోలీసులకు ఆ నిర్మాత ఫిర్యాదు చేశారు. దీంతో సదురు యూట్యూబర్‌ను పోలీసులు విచారించారు.

రీసెంట్‌గా వర్జిన్ బాయ్స్ సినిమా విడుదలైంది. చాలా కష్టపడి సినిమా చేశామని అందరూ ఆదరించాలని నిర్మాత రాజా దారపునేని కోరారు. అయితే, సినిమా విడుదల తర్వాత యూట్యూబర్‌ నవీన్ ఇచ్చిన రివ్యూపై ఆయన మండిపడ్డారు. పూలచొక్కా పేరుతో ఒక యూట్యూబ్ ఛానల్‌ను నవీన్‌ రన్ చేస్తున్నాడు. సోషల్‌మీడియాలో చాలా కాలంగా సినిమా రివ్యూలు చెప్తూ ఉంటాడు. 

అయితే, పూల చొక్క నవీన్‌ తనను రూ. 40 వేలు డబ్బు డిమాండ్‌ చేశాడని వర్జిన్ బాయ్స్ నిర్మాత రాజా దారపునేని ఫిల్మ్ నగర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశాడు. దీంతో అతనిపై కేసు నమోదైంది. సినిమా రివ్యూ మంచిగా ఇవ్వాలంటే డబ్బు ఇవ్వాలని లేకపోతే నెగిటివ్ రివ్యూ ఇస్తానని తనని బెదిరించినట్లు ఆ చిత్ర నిర్మాత ఫిర్యాదులో పేర్కొన్నాడు. అయితే, పూల చొక్క నవీన్‌ను స్టేషన్‌కు పిలిపించి విచారించిన పోలీసులు తిరిగి పంపించేశారు.

Videos

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

బరితెగింపు అంటే ఇదే.. నామినేషన్ తొలి రోజే తెగబడ్డ నారా గొడ్డలి

YSRCP రెండో జాబితా.. మేయర్ అభ్యర్థులు వీరే..!

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)