Breaking News

ప్రేమ కోసం ప్రతీకారం

Published on Fri, 01/03/2025 - 00:45

విరాజ్‌ రెడ్డి చీలం హీరోగా, మిమి లియోనార్డో, శిల్పా బాలకృష్ణన్‌ హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘గార్డ్‌’. ‘రివెంజ్‌ ఫర్‌ లవ్‌’ (ప్రేమ కోసం ప్రతీకారం) అన్నది ట్యాగ్‌లైన్ . జగా పెద్ది దర్శకత్వంలో ఈ చిత్రాన్ని అనుప్రొడక్షన్స్ పై అనసూయ రెడ్డి నిర్మించారు. ఈ చిత్రం మోషన్‌ పోస్టర్‌ను విడుదల చేశారు. ‘‘ప్రేమ, వినోదం, యాక్షన్‌ నేపథ్యంలో రూపొందిన చిత్రం ‘గార్డ్‌’. మెల్‌బోర్న్‌లో నివసించే పాతికేళ్ల కుర్రాడైన సుశాంత్‌ సెక్యూరిటీ గార్డ్‌గా పని చేస్తుంటాడు. తను కష్టపడి సొంతంగా ఓ సెక్యూరిటీ ఏజెన్సీని ఆరంభించాలనుకుంటాడు.

ఆ క్రమంలో సామ్‌ అనే సైకాలజిస్ట్‌తో అతనికి పరిచయం ఏర్పడుతుంది. ఆమెతో ప్రేమలో పడతాడు సుశాంత్‌. అనుకోని పరిస్థితుల్లో అతని జీవితం ఎలాంటి మలుపు తీసుకుంటుంది? ప్రేమ కోసం ఊహించని శక్తులతో సుశాంత్‌ ఎలాంటి పోరాటం చేశాడు? అనే కథాంశంతో ఈ మూవీ రూపొందింది. ప్రస్తుతం పోస్ట్‌ప్రొడక్షన్‌ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషలతో పాటు ఇంగ్లిష్, చైనీస్‌ భాషల్లోనూ రిలీజ్‌కి సన్నాహాలు చేస్తున్నాం’’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి కెమేరా: మార్క్‌ కె.న్‌ఫీల్డ్, సంగీతం: సిద్ధార్థ్‌ సదాశివుని.

Videos

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)