Breaking News

OTT: ‘విరా‍టపాలెం–పీసీ మీనా రిపోర్టింగ్‌’ రివ్యూ

Published on Sat, 07/05/2025 - 17:53

ఓటీటీలో ‘ఇది చూడొచ్చు’ అనే ప్రాజెక్ట్స్‌ చాలా ఉంటాయి. ప్రస్తుతం స్ట్రీమ్‌ అవుతున్న వాటిలో ‘విరా‍టపాలెం–పీసీ మీనా రిపోర్టింగ్‌’ సిరీస్‌ ఒకటి. ఈ సిరీస్‌ గురించి తెలుసుకుందాం. 

మనిషి మనుగడకు నమ్మకమే పునాది. మనం నమ్మిన సిద్ధాంతమే మనల్ని నడిపిస్తుంది. కానీ ఆ నమ్మకం మూఢ నమ్మకం కాకూడదు. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ రోజుల్లో కూడా మూఢనమ్మకాల వల్ల చాలా చోట్ల జరగరానివి జరుగుతుండడం ఆందోళనకరం. మూఢనమ్మకం మూర్ఖత్వమేనని చెప్పేదే ‘విరాటపాలెం–పీసీ మీనా రిపోర్టింగ్‌’(Viraatapalem PC Meena Reporting) సిరీస్‌. జీ5 వేదికగా స్ట్రీమ్‌ అవుతోన్న ఈ సిరీస్‌ కథాంశమంతా దాదాపు మూఢనమ్మకాల మీదే కొనసాగుతుంది. అలాగే సిరీస్‌లోని ప్రతి ఎపిసోడ్‌ ఎంతో ఉత్కంఠ రేపుతుందనడంలో సందేహం లేదు. 

ఇక కథాంశంలోకి వస్తే... 1980 సంవత్సరంలో ప్రకాశం జిల్లా ఒంగోలు ప్రాంతంలోని ఓ మారుమూల పల్లెటూరులో జరిగిన కథే ఈ సిరీస్‌. ఆ ఊరిలో పెళ్ళైన మొదటిరాత్రే పెళ్ళికూతుళ్ళు రక్తపు వాంతులు చేసుకుని చనిపోతుంటారు. దాదాపు పది సంవత్సరాల నుండి ఇలానే ఊళ్ళో జరగడం చూసి ఊళ్ళోని జనాలు తమ ఊరికి పెద్ద శాపం తగిలిందనుకుని కుమిలి΄ోతుంటారు. అంతేకాదు... ఆ ఊళ్ళో పెళ్ళి చేసుకోవడానికి కూడా జంకుతుంటారు. ఇదే సమయంలో ఆ ఊరికి కానిస్టేబుల్‌ మీనా కొత్తగా ట్రాన్స్‌ఫరై వస్తుంది. ఇలా పెళ్ళి కూతుళ్ళు చనిపోవడం చూసి మీనా దీనిపై విచారణ ప్రారంభిస్తుంది. ఒక దశలో విచారణ ఏదీ కొలిక్కి రానందున తానే పెళ్ళి పీటలెక్కి విచారణను వేగవంతం చేస్తుంది. 

పెళ్ళి చేసుకోబోతున్న మీనా కూడా తాళి కట్టించుకున్న తరువాత రక్తపు వాంతులు చేసుకుంటుంది. ఆ తరువాత కథ అనుకోని మలుపులు తిరుగుతుంది. మరి...  పెళ్ళి కూతురు అయిన మీనా ఈ కేసును సాల్వ్‌ చేయగలిగిందా? అసలు ఈ పెళ్ళి కూతుళ్ళు చని΄ోవడానికి కారణం ఆ ఊరికి పట్టిన శాపమేనా? ఇవన్నీ తెలుసుకోవాలంటే ‘విరాట΄ాలెం–పీసీ మీనా రి΄ోర్టింగ్‌’ సిరీస్‌ చూడాల్సిందే. చిన్న కథతో ఉత్కంఠ రేపే ΄ాయింట్‌తో ఊహకందని ట్విస్టులతో ప్రేక్షకుడిని ఉర్రూతలూగించే ఈ సిరీస్‌ చూడదగినదే. పిల్లలు లేకుండా పెద్దలు చూడగలిగే ఈ సిరీస్‌ వాచబుల్‌ ఫర్‌ ది వీకెండ్‌. 
– హరికృష్ణ ఇంటూరు   

Videos

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

Photos

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)