Breaking News

'కాస్త లేట్‌ అయ్యుంటే నా శరీరం చచ్చుబడిపోయేది'

Published on Thu, 12/25/2025 - 18:11

మలయాళ నటుడు, జైలర్‌ విలన్‌ వినాయకన్‌ ఆస్పత్రి నుంచి డిశ్చార్జయ్యాడు. ఆడు 3 సినిమా కోసం కేరళలోని తిరువనంతపురంలో యాక్షన్‌ సన్నివేశాల షూటింగ్‌ చేస్తుండగా వినాయకన్‌ ప్రమాదవశాత్తూ గాయపడ్డాడు. నొప్పి తీవ్రంగా ఉండటంతో ఆయన శనివారంనాడు కొచ్చిలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చేరాడు కొద్దిరోజులుగా ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్న ఆయన తాజాగా డిశ్చార్జ్‌ అయ్యాడు. 

తప్పిన ప్రమాదం
ఈ సందర్భంగా వినాయకన్‌ మాట్లాడుతూ.. నా మెడ నరానికి దెబ్బ తగిలింది. సమయానికి ఆస్పత్రికి చేరుకోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. నరాల డ్యామేజ్‌ను ముందుగానే గుర్తించకపోయుంటే నా శరీరం చచ్చుబడిపోయేది అన్నాడు. డాక్టర్లు ఆయన్ను కనీసం ఆరువారాలపాటు పూర్తిస్థాయి విశ్రాంతి తీసుకోమని సూచించారు. దీంతో ఆడు 3 సినిమా షూటింగ్‌ తాత్కాలికంగా నిలిపివేసినట్లు తెలుస్తోంది.

ఆడు 3 మూవీ
ఆడు సినిమా ఫ్రాంచైజీలో వస్తున్న మూడో భాగమే ఆడు 3. జయసూర్య హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో వినాయకన్‌ కీలక పాత్ర పోషిస్తున్నాడు. మిధున్‌ మాన్యుల్‌ థామస్‌ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రాన్ని 2026లో మార్చి 19న రిలీజ్‌ చేయనున్నారు. వినాయకన్‌ విషయానికి వస్తే.. ఇతడు 1995లో వచ్చిన మాంత్రికం చిత్రంతో తన యాక్టింగ్‌ జర్నీ ప్రారంభించాడు. 

సినిమా
'కమ్మట్టి పాదం' మూవీలో నటనకుగానూ ఉత్తమ నటుడిగా కేరళ రాష్ట్ర అవార్డును గెల్చుకున్నారు. మలయాళంతోపాటు తమిళంలోనూ పలు సినిమాలు చేసిన ఆయనకు రజనీకాంత్‌ జైలర్‌ ఊహించని స్థాయి పాపులారిటీ తెచ్చిపెట్టింది. ఆ తర్వాత ఎక్కువగా వివాదాలతోనే వార్తల్లో నిలుస్తూ వచ్చాడు. కేరళ పోలీస్‌స్టేషన్‌లో, హైదరాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌లో జరిగిన గొడవతో.. అలాగే ఓ హోటల్‌లో మద్యం మత్తులో వీరంగం సృష్టించి వార్తల్లోకెక్కాడు.

చదవండి: అమ్మ బిల్డింగ్‌పై నుంచి దూకుతానంది: ఏడ్చేసిన నందు

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)