Breaking News

బన్నీ వాసు బంపరాఫర్‌.. పుష్ప 2 షూటింగ్‌ చూసే ఛాన్స్‌!

Published on Thu, 01/19/2023 - 20:31

కిరణ్‌ అబ్బవరం హీరోగా నటిస్తున్న సినిమా 'వినరో భాగ్యము విష్ణు కథ'. కిరణ్ సరసన క‌శ్మీర ప‌ర్ధేశీ నటిస్తోంది. మెగా ప్రొడ్యూస‌ర్ అల్లు అరవింద్ స‌మ‌ర్ప‌ణ‌లో జీఏ2 పిక్చ‌ర్స్ బ్యానర్‌పై బన్నీ వాసు నిర్మిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి "వాసవసుహాస" పాటకు, చిత్ర టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తిరుమల తిరుపతి నేపథ్యంలో తెరకెక్కుతోన్న ‘వినరో భాగ్యము విష్ణుకథ’ సినిమాతో ముర‌ళి కిషోర్ అబ్బురు ద‌ర్శ‌కుడిగా తెలుగు ఇండస్ట్రీకి ప‌రిచయం అవుతున్నారు. 

సెకండ్ సింగిల్‌ను రిలీజ్ చేయడంలో భాగంగా ఈ చిత్ర బృందం Vvit గుంటూరు కాలేజ్ క్రికెట్ టీమ్‌తో మ్యాచ్ నిర్వహించింది. ఆ మ్యాచ్‌లో మ్యాన్ అఫ్ ది మ్యాచ్ ప్లేయర్‌ సైదులుతో "ఓ బంగారం నీ చెయ్యి తాకగానే ఉప్పొంగిపోయిందే నా ప్రాణం" సాంగ్ రిలీజ్ చేయించింది. ఈ సందర్భంగా కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ.. 'మా ప్రొడ్యూసర్ వాసు గారు ఈ సినిమాను మీకు దగ్గర చెయ్యాలని చెప్పి నెల ముందు నుంచి ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు. ఈ సాంగ్ నాకు చాలా స్పెషల్. భాస్కరభట్ల గారు మంచి లిరిక్స్ ఇచ్చారు' అని చెప్పుకొచ్చాడు.

బన్నీ వాసు మాట్లాడుతూ..  'ఈ సాంగ్‌ను రీల్‌గా చేసి గీతా ఆర్ట్స్‌ను ట్యాగ్ చేయండి. సెలెక్ట్ అయిన 10 మందికి, వాళ్ళ ఫ్యామిలీకి ఈ సినిమాను చూపించడమే కాకుండా వాళ్ళను పుష్ప షూటింగ్‌కు కూడా తీసుకెళ్తాం' అని ప్రకటించారు. వినరో భాగ్యము విష్ణు కథ విషయానికి వస్తే మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటింగ్ చేస్తున్న ఈ సినిమాకు విశ్వాస్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. చైతన్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రానికి స‌హ నిర్మాత‌గా బాబు వ్య‌వ‌హ‌రిస్తున్నారు. స‌త్య‌గమిడి, శ‌రత్ చంద్ర నాయుడు ఎక్స్ క్యూటివ్ నిర్మాత‌లు ఈ సినిమా 2023 ఫిబ్రవరి 17న విడుదల కానుంది. 

చదవండి: పెళ్లిపీటలెక్కిన హీరోయిన్‌, ఫోటోలు వైరల్‌

Videos

Amarnath: పరిపాలన కూడా.. ప్రైవేటీకరణ చేసే పరిస్థితి..

జిల్లాల పునర్విభజనపై శ్రీకాంత్ రెడ్డి రియాక్షన్

రిటర్నబుల్ ప్లాట్ల విషయంలో రామారావును మోసం చేసిన చంద్రబాబు ప్రభుత్వం

కళ్లు ఎక్కడ పెట్టుకున్నారు ? రెడ్ బుక్ పేరుతో బెదిరింపులు, అక్రమ కేసులు

ఆదోని మెడికల్ కాలేజీని ప్రేమ్ చంద్ షాకి అప్పగించాలని నిర్ణయం

తాడిపత్రిలో ఇంత ఫ్రాడ్ జరుగుతుంటే.. JC ప్రభాకర్ రెడ్డి పెద్దారెడ్డి కౌంటర్

అన్నమయ్య మూడు ముక్కలు ఏపీలో కొత్త జిల్లాల చిచ్చు

రాయచోటి జిల్లా కేంద్రం మార్పునకు ఆమోదం తెలిపిన మంత్రి రాంప్రసాద్

ఉన్నావ్ రేప్ కేసుపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

Anantapur: పోలీసులతో కలిసి రైతుల భూములు లాక్కుకుంటున్న టీడీపీ నేతలు

Photos

+5

ప్రభాస్ గిఫ్ట్ ఇచ్చిన చీరలో హీరోయిన్ రిద్ధి (ఫొటోలు)

+5

తిరుమలలో వైకుంఠ ఏకాదశికి సర్వం సిద్ధం.. (ఫొటోలు)

+5

అనసూయ అస్సలు తగ్గట్లే.. మరో పోస్ట్ (ఫొటోలు)

+5

థ్యాంక్యూ 2025.. భాగ్యశ్రీ క్యూట్ ఫొటోలు

+5

తిరుమల శ్రీవారి సేవలో 'ఛాంపియన్' హీరోహీరోయిన్ (ఫొటోలు)

+5

‘ది రాజా సాబ్’ప్రీ రిలీజ్ లో మెరిసిన హీరోయిన్స్‌ మాళవిక, రిద్ది కుమార్ (ఫొటోలు)

+5

సల్మాన్ ఖాన్‌ 60వ బర్త్‌డే సెలబ్రేషన్స్.. ఫోటోలు వైరల్‌

+5

దళపతి 'జన నాయగన్' ఆడియో లాంచ్ (ఫొటోలు)

+5

మేడారం : తల్లులకు తనివితీరా మొక్కులు..(ఫొటోలు)

+5

బుక్‌ఫెయిర్‌ కిటకిట..భారీగా పుస్తకాలు కొనుగోలు (ఫొటోలు)