Breaking News

ఇంటి మహాలక్ష్మి.. భార్య కాళ్లు మొక్కితే తప్పేంటి? : హీరో

Published on Thu, 11/07/2024 - 18:25

భర్త ఆయురారోగ్యాలతో ఉండాలని మహిళలు కర్వాచౌత్‌ పండగ జరుపుకుంటారు. ఆ రోజు ఉపవాసం ఉండి రాత్రి జల్లెడలో భర్త ముఖాన్ని చూస్తారు. ఉత్తరాదిన సెలబ్రిటీలందరూ ఈ పండుగను సెలబ్రేట్‌ చేసుకున్నారు. ఈ క్రమంలో 12th ఫెయిల్‌ హీరో విక్రాంత్‌ మాస్సే.. భార్య, నటి షీతల్‌ ఠాకూర్‌ కాళ్లకు నమస్కరించాడు. ఆ ఫోటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేయగా తనను విపరీతంగా ట్రోల్‌ చేశారట!

భార్య కాళ్లు మొక్కితే..
దీని గురించి తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. నా ఫోన్‌లో ఉన్న ఫోటోల్లో నాలుగు బాగా హైలైట్‌ అయ్యాయి. కొందరికి అవి నచ్చాయి. మరికొందరికి నచ్చకపోవడంతో నానా బూతులు తిట్టారు. ఎందుకలా తిడుతున్నారో నాకు అర్థం కాలేదు. భార్య కాళ్లు మొక్కితే ప్రశాంతంగా అనిపిస్తుంది. అది తప్పేమీ కాదని నా అభిప్రాయం.

అది తప్పేం కాదు
ఆమె నా ఇంటి మహాలక్ష్మి. లక్ష్మీదేవి పాదాలు తాకడం తప్పు కాదు. పదేళ్ల క్రితం నా జీవితంలో అడుగుపెట్టి లైఫ్‌ను అందంగా మార్చిందని గర్వంగా చెప్తాను. తను వచ్చాకే నాకు అంతా మంచి జరుగుతోంది. మీరెన్ని అనుకున్నా నేను నా భార్య కాళ్లు మొక్కడం మానను అని చెప్పుకొచ్చాడు.

పర్సనల్‌ లైఫ్‌
కాగా విక్రాంత్‌, షీతల్‌ ఏళ్ల తరబడి ప్రేమించుకున్నారు. 2022 ఫిబ్రవరిలో పెళ్లి చేసుకున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో కుమారుడు జన్మించగా అతడికి వర్దన్‌ అని నామకరణం చేశారు. ఇకపోతే విక్రాంత్‌ మాస్సే.. ద సబర్మతి రిపోర్ట్‌ అనే సినిమా చేస్తున్నాడు. రాశీ ఖన్నా హీరోయిన్‌గా నటిస్తున్న ఈ మూవీ నవంబర్‌ 15న విడుదల కానుంది.

 

 

చదవండి:  అది లేకపోతే ఇండస్ట్రీలో ఎవరూ పట్టించుకోరు: హీరో రాకేశ్ కామెంట్స్

Videos

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

Photos

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)