Breaking News

చైల్డ్‌ ఆర్టిస్ట్‌గా 50 సినిమాలు.. దత్తత తీసుకున్న లారెన్స్‌.. మందుకు బానిసై..

Published on Thu, 01/23/2025 - 17:52

రవిరాజ్‌ రాథోడ్‌.. విక్రమార్కుడు సినిమాలో చైల్డ్‌ ఆర్టిస్ట్‌గా అదరగొట్టాడు. ఈ ఒక్కటే కాదు ఆంధ్రవాలా, ఖడ్గం, జెమిని, మాస్‌, బొమ్మరిల్లు, డాన్‌, హైదరాబాద్‌ నవాబు, శంకర్‌దాదా ఎంబీబీఎస్‌.. ఇలా దాదాపు యాభైకి పైగా సినిమాల్లో బాలనటుడిగా చేశాడు. ప్రస్తుతం కెమెరా ముందు కాకుండా సినిమా సెట్‌లో పనిచేస్తున్నాడు. తాజాగా అతడు ఓ ఇంటర్వ్యూలో తన బాధలను పంచుకున్నాడు.

నిప్పంటించుకుని..
రవిరాజ్‌ మాట్లాడుతూ.. నాది మిర్యాలగూడ. చిన్నప్పుడు నేను సంపాదించిన డబ్బుతోనే నాన్న ఇల్లు కట్టాడు. మా ఆయన బంగారం మూవీలో సౌందర్య ఎత్తుకునే చిన్న బాబును నేనే!  చైల్డ్‌ ఆర్టిస్ట్‌గా నేను నటించిన చివరి సినిమా ఎస్‌ఎమ్‌ఎస్‌. అప్పుడే అమ్మానాన్న, బామ్మ ఒంటికి నిప్పంటించుకుని చనిపోయారు. నేను షూటింగ్‌కు వెళ్లొచ్చేసరికి అందరూ శవాలై ఉన్నారు. మా ఇంటిని పిన్నిబాబాయ్‌ వాళ్లకు ఇచ్చేసి బయటకు వచ్చేశాను.

లారెన్స్‌ దత్తత తీసుకున్నాడు
నన్ను రాఘవ లారెన్స్‌ దత్తత తీసుకున్నాడు. హాస్టల్‌ సౌకర్యం ఉన్న పెద్ద స్కూల్లో వేశాడు. నెలకు రూ.1 లక్ష ఫీజు కట్టాడు. వినాయక చవితి సెలవులు వచ్చినప్పుడు నేను ఫ్రెండ్స్‌ అంటూ ఇంటి దగ్గరే ఉండిపోయాను, తిరిగి వెళ్లలేదు. మొన్నామధ్య సెట్‌లో రాజమౌళి సర్‌ నన్ను చూసి వీపుపై రెండు దెబ్బలు వేశాడు. చైల్డ్‌ ఆర్టిస్ట్‌గా అన్ని సినిమాలు చేసి సెట్‌లో ఎందుకు పని చేస్తున్నావని తిట్టాడు. ఆరోజు షెడ్యూల్‌ అయ్యాక ఓసారి కలవమన్నారు కానీ నేనే వెళ్లలేదు.

అడుక్కోవడం ఎందుకని?
నటుడిగా కొనసాగకపోవడానికి కారణం.. అవకాశాల కోసం వెళ్తే రేపు రా, ఎల్లుండి రా.. అని తిప్పించుకున్నారు. ఇలా ఛాన్సుల కోసం అడుక్కోవడం ఎందుకని నటుడిగా ప్రయత్నించడం మానేశాను. అలాగే నేను మద్యానికి బానిసయ్యాను తాగకపోతే ఏవేవో జ్ఞాపకాలు గుర్తొస్తాయి. తాగకుండా ఒక్క రోజు ఉండలేను అని చెప్పుకొచ్చాడు.

చదవండి: ఏంటి సైఫ్‌? అర లక్ష ఏం సరిపోతుంది? కనీసం రూ.11 లక్షలైనా..: సింగర్‌

Videos

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

లోకేష్ కు బుర్ర పనిచేయడం లేదు..! మిథున్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

Photos

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)