Breaking News

తంగలాన్‌ టీజర్‌.. పామును రెండు ముక్కలు చేసిన విక్రమ్‌

Published on Wed, 11/01/2023 - 12:56

పొన్నియిన్‌ సెల్వన్‌ వంటి సూపర్ హిట్ సిరీస్‌ల తరువాత విక్రమ్‌ నటించిన చిత్రం తంగలాన్‌ కోసం సౌత్‌ ఇండియా అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఇందులో పార్వతి, మాళవిక మోహన్‌, పశుపతి ముఖ్యపాత్రలు పోషించారు. పా.రంజిత్‌ దర్శకత్వంలో స్టూడియో గ్రీన్‌ పతాకంపై కేఈ జ్ఞానవేల్‌ రాజా నిర్మిస్తున్నారు. జీవీ ప్రకాష్‌ కుమార్‌ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రం ఇటీవలే షూటింగ్‌ పూర్తి చేసుకుంది. తాజాగా ఈ సినిమా టీజర్‌ను మేకర్స్‌ విడుదల చేశారు.

టీజర్‌లో ఎలాంటి డైలాగ్స్‌ లేకున్నా విజువల్స్‌తో పాటు బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌తో దుమ్ములేపాడు. ఇందులో విక్రమ్‌ను  చాలా భయంకరంగా చూపించారని తెలుస్తోంది. యుద్ధంలో కత్తి పట్టుకొని యోధుడిలా చేతికి దొరికిన వారందరినీ హతమారుస్తు కనిపించాడు. ఓ సీన్‌లో కోబ్రా లాంటి పాముని చేతపట్టుకుని రెండు ముక్కలుగా చేసి కింద పడేస్తాడు. ఇలా ఒళ్లు గగుర్పొడిచే సీన్స్‌ ఎక్కువ ఉన్నట్లు తెలుస్తోంది.

కర్ణాటక రాష్ట్రంలోని బంగారు గనుల నేపథ్యంలో రూపొందిస్తున్నట్లు దర్శకుడు పా.రంజిత్‌ ఇది వరకే తెలిపారు. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 26న రిలీజ్ చేయనున్నట్లు వెల్లడించారు. ఒక డిఫరెంట్‌ కథనంతో తంగలాన్‌ తెరకెక్కినట్లు తెలుస్తోంది.

Videos

జియో IPO సంచలనం

బాబుకు దిమ్మతిరిగేలా.. పక్కా ఆధారాలతో SECకి ఫిర్యాదు

రెండో టీ20లో భారత మహిళా జట్టు విజయం

లోపల పసుపు..పైన ఖాకీ.. కోయ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యలపై వెంకట్ రెడ్డి సంచలన కామెంట్స్

టీడీపీకి రెబల్స్ టెన్షన్.. టికెట్లు దక్కక రెబల్స్ గా బరిలోకి!

మా ప్రభుత్వం వచ్చాక మొదటి ఆరు నెలలు నేనే హోం మంత్రి!

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

Photos

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)