Breaking News

రూ.750 జీతం, కాళ్లకు 23 ఆపరేషన్లు.. 'తంగలాన్' విక్రమ్ క్లిష్ట ప్రయాణం

Published on Tue, 08/06/2024 - 13:53

కోలీవుడ్‌ హీరో విక్రమ్ సినిమా పరిశ్రమలో అడుగుపెట్టక ముందు తాను ఎదుర్కొన్న కష్టాలను పంచుకున్నారు. విక్రమ్‌- పా రంజిత్‌ కాంబినేషన్‌లో తెరకెక్కిన తంగలాన్‌ మ్యూజిక్ లాంచ్‌ కార్యక్రమం చెన్నైలో జరిగింది. అక్కడ పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. తంగలాన్‌ లాంటి సినిమా చేయడానికి చాలా ధైర్యం కావాలని ఇప్పటికే చాలామంది సినీ ప్రముఖులు విక్రమన్‌ను ప్రశంసించారు. ఈ క్రమంలో సినిమా గురించి విక్రమ్‌ ఇలా చెప్పుకొచ్చారు.

'ఈ సినిమాలో పనిచేసిన సహాయ దర్శకులకు కృతజ్ఞతలు. నటుడు పశుపతితో ఇది నా ఆరో సినిమా. ఈ సినిమా విడుదలైన తర్వాత ఆయన పాత్ర గురించి పెద్దగా చర్చ జరుగుతుంది. మాళవిక ఈ సినిమాలో ఆర్తి పాత్ర కోసం చాలా కష్టపడ్డారు. మలయాళ నటి పార్వతితో నటించాలని చాలాసార్లు అనుకున్నాను. ఈ సినిమాలో ఆమెతో కలిసి నటించడం చాలా ఆనందంగా ఉంది.  ఈ సినిమా అందరికీ పెద్ద హిట్ అవుతుంది.

సేతు, శివ పుత్రుడు, అపరిచితుడు వంటి సినిమాల్లో చాలా కష్టపడి ఆయా పాత్రలను  పోషించాను. కానీ తంగలాన్‌తో పోలిస్తే ఆ పాత్రలు కేవలం 8 శాతం మాత్రమే. తంగలాన్‌ ప్రపంచంలో మీరు తప్పకుండా సంతోషిస్తారు. ఈ పాత్ర మనకు బాగా కనెక్ట్ అవుతుంది. నా చిన్నతనం నుంచే నటుడిని కావాలని కలలు కన్నాను. ఈ క్రమంలో 8వ తరగతి వరకు బాగా చదివాను. ఆ తర్వాత నటించాలనే కోరికతో పెద్దగా చదువుకోలేదు. అదృష్టవశాత్తూ పాస్‌ అయి కాలేజీలో చేరాను. అక్కడ నాటకంలో నటిస్తున్నప్పుడు ఉత్తమ నటుడి అవార్డు వచ్చింది. కానీ ఆ రోజు నా కాలు విరిగింది. దీంతో సంవత్సరం పాటు నేను మంచం మీద ఉన్నాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు సుమారు 23 ఆపరేషన్స్‌ జరిగాయి. 

నేను నడుస్తున్నానని డాక్టర్ చెప్పినప్పుడు మా అమ్మ ఏడ్చేసింది. కానీ, నేను తప్పకుండా నడుస్తానని చెప్పాను. సుమారు పదేళ్ల పాటు ఆ సమయంలో కష్టపడ్డాను. నా కుటుంబానికి అండగా ఉండేందుకు రూ.750 జీతానికి పనికి వెళ్లాను. అలాంటి సమయంలో కూడా సినిమాల్లో నటించాలనే తపనను మాత్రం వదల్లేదు. దీంతో కొన్ని అవకాశాలు వచ్చాయి. అలా నా పోరాటం సాగించడంతోనే ఈరోజు మీ ముందు ఇలా ఉన్నాను. ఒకవేళ అప్పుడు సక్సెస్ కాకపోతే సినిమా అవకాశాల కోసం ఇప్పటికీ ప్రయత్నిస్తూనే ఉండేవాన్ని. అనుకున్నది సాధించాలంటే కష్టం తప్పదని గుర్తుపెట్టుకోండి. అంటూ విక్రమ్‌ చెప్పుకొచ్చారు.

Videos

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)