Breaking News

తంగలాన్‌ షూటింగ్‌లో విక్రమ్‌, మాళవిక..

Published on Mon, 06/19/2023 - 10:01

ప్రస్తుతం నిర్మాణంలో వున్న క్రేజీ తమిళ చిత్రాల్లో తంగలాన్‌ ఒకటి. హీరో విక్రమ్‌, దర్శకుడు పా.రంజిత్‌ కాంబినేషన్‌లో రూపొందుతున్న వినూత్న కథా చిత్రమిది. హీరోయిన్‌ మాళవికా మోహన్‌, పార్వతి, పశుపతి, డేనియల్‌ కాల్టకిరోన్‌ ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రాన్ని స్టూడియో గ్రీన్‌ పతాకంపై కేఈ జ్ఞానవేల్‌ రాజా నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్‌ చివరి దశకు చేరుకున్న తరుణంలో అనూహ్యంగా విక్రమ్‌ ప్రమాదానికి గురికావడంతో షూటింగ్‌కు అంతరాయం కలిగింది.

అయితే తంగలాల్‌ చిత్ర షూటింగ్‌ను మరో 12 రోజులు నిర్వహిస్తే పూర్తవుతుందని దర్శకుడు పా.రంజిత్‌ వెల్లడించారు. జూన్‌ 15 తరువాత మళ్లీ షూటింగ్‌ మొదలు పెడతామని చెప్పారు. దీంతో వైద్య చికిత్స, విశ్రాంతి అనంతరం విక్రమ్‌ మళ్లీ ఫుల్‌ ఎనర్జీతో షూటింగ్‌కు సిద్ధమయ్యారు. తంగలాన్‌ చిత్ర షూటింగ్‌ శనివారం నుంచి చైన్నెలో జరుగుతోంది. ఈ విషయాన్ని మాళవికమోహన్‌ తన ఇన్‌స్ట్రాగామ్‌లో పేర్కొంది.

అందులో తాను ఇప్పుడు చైన్నెలో ఉన్నానని విక్రమ్‌తో కలిసి తంగలాన్‌ చిత్ర షూటింగ్‌లో పాల్గొన్నానని తెలిపింది. మరో 20 రోజులు ఇక్కడే ఉంటానని కూడా తెలిపారు. ఇది కోలార్‌ గోల్డ్‌ తవ్వకాల్లోని కార్మికులు తమ అధికారం కోసం పోరాడే నేపథ్యంలో సాగే కథా చిత్రం అన్నది తెలిసిందే. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాలను జరుపుకుంటున్న ఈ చిత్రం వచ్చే సంక్రాంతికి తెరపైకి రానున్నట్లు సమాచారం.

చదవండి: ఎక్కడ సమాధి చేయాలో ముందే కోరిన రాకేశ్‌ మాస్టర్‌

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)