Breaking News

విక్రమ్‌ ‘కోబ్రా’ ఓటీటీ పార్ట్‌నర్‌ ఇదే! స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే..

Published on Tue, 09/13/2022 - 20:56

విలక్షణ నటుడు చియాన్‌ విక్రమ్‌ నటించిన లేటెస్ట్‌ చిత్రం ‘కోబ్రా’. కేజీయఫ్‌ బ్యూటీ శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటించించింది. మాజీ క్రికెటర్‌, ఆల్‌రౌండర్‌ ఇర్ఫాన్ పఠాన్‌ కీలక పాత్రల్లో కనిపించారు. అజయ్‌ జ్ఞానముత్తు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఎన్నో అంచనాల మధ్య ఆగస్ట్‌ 31న థియేటర్లో విడుదలైంది. విక్రమ్‌ విభిన్న పాత్రల్లో అలరించిన ఈ చిత్రం మిక్స్‌డ్‌ టాక్‌ తెచ్చుకుంది. అయితే ఎప్పటిలాగే విక్రమ్‌ నటన మాత్రం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. అయినప్పటికీ ఈ మూవీ ఆశించిన విజయం సాధించలేకపోయింది.

చదవండి: వందల ఎకరాలు, రాజభవనం.. కృష్ణంరాజు ఆస్తులు ఎన్ని కోట్లో తెలుసా!

ఇదిలా ఉంటే ఈ మూవీ డిజిటల్‌ ప్రీమియర్‌పై తాజాగా ఓ ఆసక్తికర అప్‌డేట్‌ నెట్టింట చక్కర్లు కొడుతోంది. కోబ్రా మూవీ డిజిట‌ల్ హ‌క్కుల‌ను ప్రముఖ ఓటీటీ సంస్థ సోని లివ్ భారీ మొత్తానికి సొంతం చేసుకున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. త్వరలోనే ఈ చిత్రాన్ని అందుబాటులోకి తీసుకువచ్చేందుకు మేకర్స్‌ సన్నాహాలు చేస్తున్నారట. ఈ తాజా బజ్‌ ప్రకారం తమిళం, తెలుగులో సెప్టెంబ‌ర్ 23 లేదా 30న ఈ చిత్రాన్ని స్ట్రీమింగ్ చేయాల‌ని భావిస్తున్నార‌ట‌. దీనికి సంబంధించి త్వరలోనే అధికారిక ప్రకటన కూడా రానుందని సమాచారం. సెవెన్ స్క్రీన్‌ స్టూడీయో ప‌తాకంపై ఎస్.ఎస్ ల‌లిత్‌కుమార్ నిర్మించిన ఈ చిత్రానికి ఏ.ఆర్‌.రెహమాన్ స్వరాలు సమకూర్చారు.

చదవండి: పెళ్లి చేసుకోకపోయినా.. పిల్లల్ని కంటాను: ‘సీతారామం’ బ్యూటీ షాకింగ్‌ కామెంట్స్‌

Videos

వల్లభనేని వంశీకి అస్వస్థత

సారీ బాబు గారు.. ఇక్కడ బిల్డింగులు కట్టలేం

కవిత లేఖ ఓ డ్రామా: బండి సంజయ్

హైదరాబాద్ లో కరోనా కేసు నమోదు

జహీరాబాద్ అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం: సీఎం రేవంత్

ప్రకాశం జిల్లా రోడ్డు ప్రమాదంపై వైఎస్ జగన్ విచారం

YSRCP హరికృష్ణను పోలీసులు బలవంతంగా తీసుకెళ్లి.. దారుణం! : Ambati Rambabu

Sake Sailajanath: ఆరోపణలే తప్ప ఆధారాలు లేవు

First case: కడప కరోనా కేసును దాచిపెట్టేందుకు అధికారుల యత్నం

హార్వర్డ్ విశ్వవిద్యాలయానికి ట్రంప్ సర్కార్ 6 షరతులు

Photos

+5

ఆసక్తికరమైన ‘పైనాపిల్‌’ ఫ్యామిలీని చూశారా? (ఫొటోలు)

+5

Cannes 2025 : కాన్స్‌ రెడ్‌కార్పెట్‌పై,హొయలొలికించిన నటి ప్రణీత (ఫొటోలు)

+5

శ్రీవారితో కలిసి 14 కిలోమీటర్ల గిరిప్రదక్షిణచేసిన నటి వితికా షేరు (ఫొటోలు)

+5

కాళేశ్వరం : సరస్వతి నది పుష్కరాలకు..పోటెత్తిన భక్తులు (ఫొటోలు)

+5

శిల్పకళా వేదిక : మిస్ వరల్డ్ టాలెంట్ గ్రాండ్ ఫినాలే..అందాల భామల సందడి (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో ‘థగ్‌ లైఫ్‌’ చిత్రం మీడియా మీట్‌ (ఫొటోలు)

+5

విజయవాడ : వైభవంగా హనుమాన్ జయంతి శోభాయాత్ర (ఫొటోలు)

+5

కొడుకు, చెల్లెలితో సానియా మీర్జా క్యూట్‌ మూమెంట్స్‌ (ఫొటోలు)

+5

Miss World 2025 : శిల్పారామంలో ఆడి పాడుతూ సందడి చేసిన గ్లోబల్‌ బ్యూటీలు (ఫొటోలు)

+5

లిక్కర్‌ స్కాం.. బాబు బేతాళ కథలు.. జగన్‌ ధ్వజం (చిత్రాలు)