Breaking News

విజయవాడలో ఎవరైనా వచ్చి కాపాడండి: బిగ్‌బాస్‌ తేజ

Published on Tue, 09/03/2024 - 11:57

విజయవాడ వరద ప్రభావిత ప్రాంతంలో ఉన్న అపార్టుమెంట్‌ వాసుల కష్టాలు వర్ణనాతీతంగా ఉన్నాయి. ముంపునకు గురైన బాధితులు ఆపన్న హస్తం కోసం హాహాకారాలు చేస్తున్నారు. వరద ప్రాంతాల్లోని అపార్టుమెంట్ల సెల్లార్లు పూర్తిగా మునిగిపోయి కార్లు, ద్విచక్ర వాహనాలు కాగితం పడవల్లా తేలియాడుతున్నాయి. పైఅంతస్తుల్లో ఉన్న వారంతా రెండ్రోజులుగా గడప దాటే పరిస్థితి లేక అల్లాడిపోతున్నారు.  ప్రభుత్వ సాయం అందక చాలామంది అల్లాడిపోతున్నారు. తమ వీధుల వెంట వెళ్తున్న వార్ని గుండెలవిసేలా పిలుస్తూ.. తమను ఆదుకోండి అంటూ ఆర్తిగా కోరుతున్నారు.

ఇలాంటి ఇబ్బందులు పడుతున్న ఒక కుటుంబాన్ని కాపాడాలని బిగ్‌బాస్‌ ఫేమ్‌ టేస్టీ తేజా కోరారు. ఈ క్రమంలో ఒక వీడియోను కూడా ఆయన పంచుకున్నారు. పసిపిల్లలు,మహిళలు,వృద్ధులు వరద ప్రభావిత ప్రాంతంలో చిక్కుకుపోయామని వీడియోలో బాధితుడు తెలిపాడు. ఏపీ ప్రభత్వం లేదా విజయవాడలోని ఎవరైన తమను కాపాడాలని కోరారు. రెండు రోజులుగా పిల్లలకు పాలు, ఆహారం కూడా లేదని వాపోయారు. చాలామంది అధికారులకు మెసేజ్‌ చేసినా ఫలితం లేదని ఆయన తెలిపారు. దయచేసి తమను కాపాడాలని వారు వేడుకున్నారు. టేస్టీ తేజా షేర్‌ చేసిన ఈ వీడియో నెట్టింట వైరల్‌ అవుతుంది.

ప్లీజ్ మమ్మల్ని కాపాడండంటూ వ్యక్తి సెల్పీ వీడియో..

Videos

లోన్ కట్టలేదని వేధిస్తున్నారా? RBI రూల్స్ ఇవే!

దేనితో కొట్టాలి వీళ్లని.. పోలీసులే అభ్యర్థులను లాక్కెళుతున్నారు

సల్మాన్ ఖాన్‌తో పనిచేస్తే ఇదే గతి.. ఈ అనిల్ పండిత్ ఎవరు..?

PF ఉన్నవారందరికీ పెన్షన్ వస్తుందా? అసలు లెక్కలు తెలుసుకోండి..

వేటకొడవల్లితో TDP రౌడీలు దాడి.. బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

తిరుపతిలో దొంగల బీభత్సం 90 గ్రాముల బంగారం చోరీ!

టీడీపీ దాడులకు భయపడే ప్రసక్తేలేదు.. సజ్జల మాస్ వార్నింగ్

వైరల్ అవుతున్న వీడియో, దారుణం.. వెంటబడి మరి TDP గూండాల అరాచకం

టీడీపీ గూండాలు... కడపలో కత్తిపోట్లు.. పులివెందులలో కాల్పుల కలకలం

ఒక్కొక్కడి పేరు అడ్రస్ నోట్ చేస్తున్న.. సిగ్గు లేకుండా ఫోన్ ఆఫ్ చేసి పారిపోయారు

Photos

+5

యాంకర్ అనసూయ ఇంట్లో దసరా సెలబ్రేషన్ ఇలా (ఫొటోలు)

+5

ఫ్యాషన్ షో కోసం తృప్తి దిమ్రి క్రేజీ గ్లామర్ (ఫొటోలు)

+5

దసరా స్పెషల్.. చూడముచ్చటగా విజయ్-రష్మిక జంట (ఫొటోలు)

+5

నాకు హైదరాబాద్ ఎంతిష్టమో మీకు తెలుసు.. రకుల్ ప్రీత్ లేటెస్ట్ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో సందడిగా 'రామాయణ' ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)