Breaking News

జూ.ఎన్టీఆర్‌-కొరటాల చిత్రంలో అలనాటి లేడీ సూపర్‌ స్టార్‌?

Published on Mon, 09/05/2022 - 15:08

ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాలో పాన్‌ ఇండియా స్టార్‌ క్రేజ్‌ సొంతం చేసుకున్నాడు యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌. అదే రేంజ్‌లో ఎన్టీఆర్‌ 30 సినిమాను ప్లాన్‌ చేస్తున్నాడు కొరటాల. ప్రస్తుతం తారక్‌ కొరటాల శివ డైరెక్షన్‌లో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ప్ర్తసుతం ప్రీప్రొడక్షన్‌ పనులను జరుపుకుంటున్న ఈ చిత్రం త్వరలోనే సెట్స్‌పైకి రానుంది. అంత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించబోతున్న ఈ చిత్రం కోసం కొరటాల భారీ తారాగణంతో ప్లాన్‌ చేస్తున్నాడట. ఇప్పటికే ఈ సినిమాలో ప్రతి కథానాయకుడిగా విలక్షణ నటుడు జగపతిబాబును ఎంపిక చేసిన సంగతి తెలిసిందే.

చదవండి: ‘లైగర్‌’ ఫ్లాప్‌.. చార్మీ షాకింగ్‌ నిర్ణయం

అలాగే ఇందులో పవర్ఫుల్‌ మహిళా పాత్ర ఉందట. దానికి కోసం అలనాటి హీరోయిన్‌, టాలీవుడ్‌ తొలి లేడీ సూపర్‌స్టార్‌ విజయశాంతిని సంప్రదించినట్లు సమాచారం. ఆమెను కలిసి కొరటాల కథ వినిపించారట. అయితే దీనికి ఆమె గ్రీన్‌ సిగ్నిల్‌ ఇచ్చిందా? లేదా? అనేది తెలియాల్సి ఉంది. కాగా సుదీర్ఘ విరామం అనంతరం ఆమె సరిలేరు నీకెవ్వరు చిత్రంతో రీఎంట్రీ ఇచ్చి బ్లాక్‌బస్టర్‌ హిట్‌ కొట్టింది. ఈ సినిమాలో తన పాత్ర నచ్చడం వల్లే చేశానని, ఇకపై అలాంటి రోల్‌ వస్తుందనే నమ్మకం లేదన్నారు. మళ్లీ అలాంటి పాత్ర వస్తే చేస్తానని చెప్పిన విజయశాంతి ఇకపై సినిమాలు చేయనని కూడా చెప్పిన సంగతి తెలిసిందే.

చదవండి: నిర్మాతతో టీవీ నటి రెండో పెళ్లి, కొత్త జంటపై దారుణమైన ట్రోల్స్‌

మరి విజయశాంతి ఎన్టీఆర్ సినిమాకు ఒకే చెప్తుందా? లేదా అనేది తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే. మరోవైపు ఈ సినిమాలో ఇంకా హీరోయిన్‌ ఎవరనేది ఫైనల్‌ కాలేదు. ఇప్పటికే ఈ చిత్రంలో ఫీమేల్‌ లీడ్‌ రోల్‌ కోసం బాలీవుడ్‌ బ్యూటీ జాన్వీ కపూర్‌, స్టార్‌ హీరోయిన్‌ సమంతల పేర్లు వినిపంచగా వీరు ఈ ప్రాజెక్ట్‌ చేయట్లేదనేది స్పష్టమైంది. మరి కొరటాల చివరకు హీరోయిన్‌గా ఎవరిని ఎంపిక చేయనున్నారనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా ఉంది. 

Videos

రాజ్ తో సమంత రిలేషన్‌ను బయటపెట్టేసిన సీనియర్ నటి..!

అల్లు అర్జున్ తో నిహారిక లవ్ స్టోరీ

కమ్మేస్తోన్న కరోనా కాటేరమ్మ కొడుకునూ వదలని వైరస్

సత్యసాయి జిల్లా రామగిరి ఎంపీపీ ఎన్నికలో టీడీపీకి ఎదురుదెబ్బ

అందాల పోటీల మీదనే కాదు.. ప్రజల ప్రాణాల మీద దృష్టి పెట్టాలి: కేటీఆర్

గుల్జార్ హౌస్ లో అసలేం జరిగింది?

YSRCP కౌన్సిలర్లను కిడ్నాప్ చేసిన టీడీపీ గూండాలు

ISI ఏజెంట్ జ్యోతి మల్హోత్రా కేసులో వెలుగులోకి సంచలన విషయాలు

పాక్‌కు దెబ్బ మీద దెబ్బ BCCI సంచలన నిర్ణయం

ఓటమి భయంతో YSRCP నేతలపై దాడి

Photos

+5

పెళ్లయి మూడేళ్లు.. నిక్కీ-ఆది హ్యాపీ మూమెంట్స్ (ఫొటోలు)

+5

ఏలూరులో ఘనంగా ‘భైరవం’ సినిమా ట్రైలర్ రిలీజ్ వేడుక (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : 'సూర్య- వెంకీ అట్లూరి' కొత్త సినిమా ప్రారంభం (ఫొటోలు)

+5

కూటమి ప్రభుత్వంలో హిందూ దేవాలయాలపై ఆగని దాడులు

+5

కాజల్‌ బర్త్‌డే స్పెషల్‌.. ఆ సినిమాతోనే స్టార్‌డమ్‌ (ఫొటోలు)

+5

23వ 'జీ సినీ అవార్డ్స్'.. ముంబైలో మెరిసిన స్టార్‌ హీరోయిన్స్‌ (ఫోటోలు)

+5

విజయవాడలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం (ఫొటోలు)

+5

ట్యాంక్‌ బండ్‌పై అట్టహాసంగా ప్రారంభమైన సండే ఫండే వేడుకలు (ఫొటోలు)

+5

వరంగల్ : సరస్వతీ పుష్కరాలకు పోటెత్తిన భక్తులు..(ఫొటోలు)

+5

తెలంగాణ సచివాలయంలో అందగత్తెలు