Breaking News

సినిమాను ఖూనీ చేద్దామని దుష్టశక్తుల ప్రయత్నం.. విజయశాంతి వార్నింగ్‌

Published on Sat, 04/19/2025 - 16:05

నందమూరి కళ్యాణ్‌ రామ్‌, విజయశాంతి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం అర్జున్‌ సన్నాఫ్‌ వైజయంతి (Arjun S/O Vyjayanthi Movie). ప్రదీప్‌ చిలుకూరి దర్శకత్వం వహించిన ఈ మూవీ ఏప్రిల్‌ 18న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రానికి మిక్స్‌డ్‌ రివ్యూలు వస్తున్నాయి. మిశ్రమ స్పందన మధ్య సినిమా తొలిరోజు దాదాపు రూ.5 కోట్ల కలెక్షన్స్‌ రాబట్టింది. డిస్ట్రిబ్యూటర్లు పెట్టిందంతా మంగళవారం లోపు తిరిగి వచ్చేస్తుందని కళ్యాణ్‌ రామ్‌ ధీమాగా ఉన్నాడు. అయితే విజయశాంతి మాత్రం సినిమాకు నెగెటివ్‌ రివ్యూ ఇచ్చినవారిపై ఆగ్రహం వ్యక్తం చేసింది.

ఇదే మా హెచ్చరిక..
శనివారం ఏర్పాటు చేసిన అర్జున్‌ సన్నాఫ్‌ వైజయంతి సినిమా సక్సెస్‌ మీట్‌లో విజయశాంతి (Vijayashanthi) మాట్లాడుతూ.. సినిమాను ఖూనీ చేద్దామనుకునే వారికి మా హెచ్చరిక.. సినిమాలపై తప్పుడు ప్రచారం చేసే వారు తమ పద్దతి మార్చుకోవాలి. కొంత మంది కావాలనే శాడిజంతో సినిమాల్ని ఇబ్బండిపెడుతున్నారు. ప్రతి ఒక్క మూవీ ఆడాలనేది మా కోరిక. బాగున్న సినిమాను బాగా లేదని, బాగోలేని సినిమాను బాగుందని ప్రచారం చేయడం ఏంటి? చిన్న మూవీ అయినా పెద్ద మూవీ అయినా ఎన్నో ఆశలతో పరిశ్రమలోకి వస్తారు. సినిమా నచ్చకపోతే చూడకండి, నిశ్శబ్దంగా ఉండండి.

సినీ ఇండస్ట్రీని బతికించండి
సినిమా నచ్చలేదని.. ఖూనీ చేద్దామని కొన్ని దుష్ట శక్తులు ప్రయత్నిస్తున్నాయి. థియేటర్లలో ప్రజలు మా మూవీ చూసి అద్భుతంగా ఉందంటున్నారు. ప్రజలకు నచ్చిన సినిమాలపై మీకెందుకు అంత పైశాచిక ఆనందం. మనస్ఫూర్తిగా దీవించడం నేర్చుకోండి.. అంతేకానీ మంచి చిత్రాలను చంపే హక్కు మీకు లేదు. సినిమా ఇండస్ట్రీని బతికించండి. సినిమాను చంపేస్తే కొన్ని జీవితాలు పోతాయి. కోట్లు ఖర్చుపెట్టి తీసే సినిమాలను నాశనం చేసేవాళ్లను జీవితంలో క్షమించకూడదు అని విజయశాంతి పేర్కొంది.

చదవండి: నటుడి పరిస్థితి విషమం.. కాలేయదానం చేస్తానన్న కూతురు..

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)