Breaking News

కొందరు హీరోయిన్లు నా ట్యాగ్ తీసుకున్నారు: విజయశాంతి

Published on Tue, 04/22/2025 - 17:21

లేడీ సూపర్ స్టార్ అనగానే మీకు ఎవరు గుర్తొస్తారు? కొందరు నయనతార అంటారు. మరికొందరు సమంత లేదా సాయిపల్లవి పేరు చెబుతుంటారు. వీళ్లందరూ కాదు ఈ ట్యాగ్ ని మొట్టమొదట హీరోయిన్ విజయశాంతి కోసం ఉపయోగించారు. ఇప్పుడు చాలామంది హీరోయిన్లకు దీన్ని ట్యాగ్ చేస్తున్నారు. ఇప్పుడదే విషయమై విజయశాంతిని అడగ్గా.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

'నాకు లేడీ సూపర్ స్టార్ అనే ట్యాగ్.. 'ప్రతిఘటన' మూవీ తర్వాత ప్రజలు ఇచ్చారు. నేను యాక్టివ్ గా లేనప్పుడు కొంతమంది హీరోయిన్లు ఆ ట్యాగ్ తీసుకున్నారు. పాపం వాళ్లు కూడా బ్రతకాలి కదా అని పెద్దగా పట్టించుకోలేదు' అని విజయశాంతి చెప్పుకొచ్చారు.

(ఇదీ చదవండి: ప్రాణ భయం.. వేరే దేశంలో ఇల్లు కొన్న 'దేవర' విలన్)

చాన్నాళ్ల పాటు సినిమాలకు దూరంగా ఉన్న విజయశాంతి.. మహేశ్ బాబు 'సరిలేరు నీకెవ్వరు' మూవీతో రీఎంట్రీ ఇచ్చారు. ఇది వచ్చిన ఐదేళ్లకు తాజాగా 'అర్జున్ సన్నాఫ్ వైజయంతి' చిత్రంతో ప్రేక్షకుల్ని పలకరించారు. తన పాత్రకు వస్తున్న ఆదరణ దృష్ట్యా.. తాజాగా జరిగిన ప్రెస్ మీట్ లో లేడీ సూపర్ స్టార్ ట్యాగ్ గురించి మాట్లాడారు.

ఇదే ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ.. హీరోలని మీరు అని సంభోదిస్తున్నారని కానీ హీరోయిన్లని మాత్రం ఇండస్ట్రీలో నువ్వు అని అంటున్నారని, ఇది తనకు చాలా బాధ కలిగించిందని విజయశాంతి చెప్పుకొచ్చారు. దయచేసి ఇకపై హీరోయిన్లని కూడా మీరు అనే సంభోదించాలని కోరారు. అప్పట్లో సీనియర్ ఎన్టీఆర్, ఏఎన్నార్ తనని మీరు అంటూ పిలిచేవారని, అది చూసి తను ఆశ్చర్యపోయిన విషయాన్ని గుర్తుచేసుకున్నారు.

(ఇదీ చదవండి: సడన్ గా ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సినిమాలు)

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)