Breaking News

విజయకాంత్‌ ఫోటోను విడుదల చేసిన సతీమణి

Published on Sun, 12/03/2023 - 11:26

డీఎండీకే అధినేత, కోలీవుడ్‌ నటుడు విజయకాంత్‌ కోలుకుంటున్నారని ఆయన సతీమణి ప్రేమలత తెలిపారు. అనారోగ్యం కారణంగా నవంబర్‌ 18న చెన్నైలోని మయత్‌ ఆస్పత్రిలో ఆయన చేరారు. ఆయన ఆరోగ్యం నిలకడగా లేదని ఆస్పత్రి వర్గాలు తెలపడంతో ఆయన ఫ్యాన్స్‌లో ఆందోళన మొదలైంది. తర్వాత ఆయన కోలుకుంటున్నారని మరో 14 రోజుల పాటు ఆసుపత్రిలో నిరంతర చికిత్స అందించాల్సి ఉందని వైద్యులు తెలిపారు. ఇలా వైద్యుల నుంచి భిన్నాభిప్రాయాలు రావడంతో ఫ్యాన్స్‌లో మరింత ఆందోళన నెలకొంది.

దీంతో ఆయన సతీమణి ప్రేమలత ఒక వీడియో ద్వారా విజయకాంత్‌ ఆరోగ్యంపై కీలక ప్రకటన చేశారు. ఆయన ఆరోగ్యంగా ఉన్నారని, త్వరలో క్షేమంగా ఇంటికి వస్తారని చెప్పడంతో ఫ్యాన్స్‌ ఊపిరి పీల్చుకున్నారు. ఆస్పత్రి వద్దకు పోలీసులు భద్రతను ఏర్పాటు చేయడంతో విజయకాంత్‌ ఆరోగ్యంపై మళ్లీ అనుమానాలు రేకెత్తాయి. వాటిని ఖండించిన ప్రేమలత... విజయకాంత్‌తో ఉన్న పోటోలను విడుదల చేసింది. కెప్టెన్ ఆరోగ్యంగా ఉన్నాడు. అతి త్వరలో ఆరోగ్యంతో ఇంటికి తిరిగి వచ్చి మనందరినీ చూస్తాడు. వదంతులను ఎవరూ నమ్మవద్దు, ప్రచారం చేయవద్దు! అని దయతో మనవి చేస్తున్నానని తెలిపింది.

ఆయనకు వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నారని కృత్రిమ శ్వాసక్రియతో చికిత్సపొందుతున్నారని పలు యూట్యూబ్‌ ఛానల్స్‌ రకరకాలుగా తప్పుడు ప్రచారం చేయడం భాదగా ఉందని ఆమె తెలిపింది. ఇప్పటికైన ఆయన ఆరోగ్యంపై తప్పుడు ప్రచారాలు చేయడం ఆపాలని ప్రేమలత కోరింది.

Videos

త్వరలోనే జియో 6G టెక్నాలజీ...! ఆకాష్ అంబానీ కీలక ప్రకటన

రాయచోటిలో హైటెన్షన్.. YSRCP ఆఫీస్ కి వాహనాలకి నిప్పు

విశాఖ మేయర్ అభ్యర్థిగా వరుదు కళ్యాణి

రణబాలి సెన్సార్ రివ్యూ అవుట్.. సినిమా ఎలా ఉండనుందంటే..!

సుపారి ఇచ్చిన TDP నేతలు మిథున్ రెడ్డిపై మర్డర్ స్కెచ్ బట్టబయలు

దసరాకు విశ్వంభర సర్ ప్రైజ్ ...

EXCLUSIVE VISUALS: చేతికి గాయాలతో మిథున్ రెడ్డి

బంగారం కొనేవారికి గుడ్ న్యూస్! ఇవాళ తులం ఎంతంటే

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)