Breaking News

విజయ్‌కాంత్ గొప్పమనసు.. వారికోసం స్థలం ఇస్తానన్న కెప్టెన్.!

Published on Thu, 12/28/2023 - 11:51

సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నెలకొంది. తమిళనాడు డీఎండీకే అధినేత, నటుడు విజయకాంత్‌ అనారోగ్యంతో గురువారం కన్నుమూశారు. చెన్నైలోని మియాట్ ఇంటర్నేషనల్ ఆస్పత్రిలో చేరిన వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్న ఆయన తుదిశ్వాస విడిచారు. కొద్ది సేపటి క్రితమే కరోనా సోకినట్లు ప్రకటించిన వైద్యులు.. ఆయన మృతి చెందినట్లు తెలిపారు. విజయ్‌కాంత్ మృతి పట్ల కోలీవుడ్ ప్రముఖులు, రాజకీయ నాయకులు సంతాపం ప్రకటించారు. అయితే గతంలో కరోనా విజృంభిస్తున్న సమయంలో ఆయన గొప్ప మనసును చాటుకున్నారు. కరోనా వైరస్‌ బారినపడి మృతి చెందిన వారి ఖననానికి తన సొంత స్థలం ఇస్తానని ప్రకటించారు. ఈ విషయంపై ఆయన గతంలో ట్వీట్‌ చేశారు.

ఎందుకలా చేశారంటే...

గతంలో చెన్నైకి చెందిన ఓ వైద్యుడికి కరోనా వైరస్‌ సోకింది. పరిస్థితి విషమించడంతో ఆయన మృతి చెందాడు. దీంతో వైద్యుడి మృతదేహాన్ని ఖననం చేయడానికి వెళ్లగా.. అక్కడి స్థానికులు అడ్డుకున్నారు. దీనిపై స్పందిస్తూ విజయ్‌కాంత్‌ ప్రకటన విడుదల చేశారు. కరోనాతో మృతిచెందిన వారిని ఖననం చేయడానికి తన సొంత స్థలం ఇస్తానన్నారు.

తన ఆండాళ్‌ అళగర్‌ ఇంజినీరింగ్‌ కళాశాల ప్రాంగణంలోని కొంత భాగాన్ని ఖననానికి ఇస్తున్నట్లు వెల్లడించారు. కరోనాతో మృతి చెందినవారిని ఖననం చేయటంతో వైరస్‌ వ్యాపించెందదని..  ప్రభుత్వం ప్రజలకు అవగాహన కల్పించాలని అప్పటి విజయ్‌కాంత్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. కానీ ఇవాళ విజయ్‌కాంత్ మృతి చెందడం అభిమానులకు షాక్‌కు గురిచేసింది.

Videos

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు