కెప్టెన్‌కు కన్నీటి వీడ్కోలు.. ముగిసిన అంత్యక్రియలు

Published on Fri, 12/29/2023 - 19:21

డీఎండీకే అధినేత,​ నటుడు విజయ్‌కాంత్​ (71) అంత్యక్రియలు అధికార లాంఛనాలతో ముగిశాయి. కోయంబేడులోని పార్టీ ప్రధాన కార్యాలయ ఆవరణలో ఆయన పార్థివదేహానికి కుటుంబసభ్యులు అంతిమ సంస్కారాలు నిర్వహించారు. సినీ ప్రముఖులు, బంధువులు, సన్నిహితులు, అభిమానులు ఆశ్రునయనాలతో కెప్టెన్ అంతిమయాత్ర ముగిసింది.

కాగా.. మొదట విజయ్‌కాంత్‌ భౌతికకాయాన్ని డీఎండీకే కార్యాలయానికి తరలించారు.  ఆ తర్వాత విజయకాంత్‌ పార్థివదేహాన్ని చెన్నైలోని తీవు తిడల్‌కు తరలించి ప్రజల సందర్శనార్థం ఉంచారు. అక్కడే సినీస్టార్ కమల్​ హాసన్​, రజనీకాంత్​ ఆయనకు నివాళులు అర్పించారు. విజయకాంత్‌ చివరి చూపు కోసం సామాన్య ప్రజలు, కార్యకర్తలు, అభిమానులు పెద్దఎత్తున తరలివచ్చారు. అనంతరం డీఎండీకే ప్రధాన కార్యాలయానికి  పార్థివదేహాన్ని తరలించి అంత్యక్రియలు పూర్తి చేశారు. 

కాగా.. కెప్టెన్‌ విజయకాంత్‌(71) డిసెంబర్‌ 28న అనారోగ్యంతో కన్నుమూశారు. ఆయన మరణంతో అటు అభిమానులు, సెలబ్రిటీలు విషాదంలో మునిగిపోయారు. ఎంతోమంది హీరోయిన్లకు కెరీర్‌ ఇచ్చి, మరెందరో హీరోలకు ఆదర్శంగా నిలిచిన ఆయన తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. 

Videos

వరదకు ఎదురీది.. ప్రాణం కాపాడిన యువకుడు

మా వెనుక శేఖర్ మాస్టర్.. సుమలత మాకు అవసరం లేదు, మాకు రఘు మాస్టర్ బెస్ట్

రేవెంత్ కు కొండా పంచ్ అదిరిపోయే పంచ్

అమెరికా పునాదులు కదిలిస్తాం?

డబ్బు కోసం స్నేహితుడినే కిడ్నాప్.. పట్టించిన వాట్సాప్ మెసేజ్

చంద్రబాబు చీప్ పబ్లిసిటీపై వైఎస్ జగన్ ఆగ్రహం

ఇచ్చి ఒక నెల కూడా కాలేదు లోకేష్ ని ఏకిపారేసిన శ్రీదేవి

నచ్చకపోతే వెళ్లిపోండి జపాన్ క్రికెట్ CEO బీసీసీఐకి షాక్

దొంగతనం ఒప్పుకోమంటూ..! పోలీసుల వేధింపులపై అర్చకుడి తల్లి కన్నీళ్లు

నేనూ సీఎం అవుతా టైం వస్తే అన్నీ అవే వస్తాయి

Photos

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)

+5

అందాల ముద్దుగుమ్మ ఆషిక రంగనాథ్ (ఫొటోలు)

+5

ప్రభాస్‌ని కలిసిన డై హార్డ్ ఫ్యాన్.. షర్ట్‌పై ఆటోగ్రాఫ్‌ తీసుకున్న యంగ్‌ హీరో (ఫోటోలు)

+5

పని.. ‍ప్రకృతిలో మమేకం.. శ్రీనిధి జ్ఞాపకాలు (ఫొటోలు)

+5

'బెత్లెహెమ్ కుటుంబ యూనిట్' సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

అమ్మ చేతి వంట.. వేపపుల్లతో బ్రషింగ్.. షాకిచ్చిన శోభిత (ఫొటోలు)