Breaking News

సూపర్‌స్టార్‌ ఇంట దసరా వేడుకలు.. కానీ రజనీయే మిస్సింగ్‌!

Published on Thu, 10/26/2023 - 10:44

సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ ఇంట్లో మంగళవారం నాడు నవరాత్రి వేడుకలు ఘనంగా సాగాయి. పండగ చివరి రోజున రజనీకాంత్‌ సతీమణి లతా రజనీకాంత్‌ ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. స్థానిక పోయిస్‌ గార్డెన్‌లోని తమ ఇంటిలో నిర్వహించిన ఈ వేడుకల్లో పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు పాల్గొనడం విశేషం.

ముఖ్యంగా తెలంగాణ గవర్నర్‌, పుదుచ్చేరి లెఫ్టినెంట్‌ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ సతీమణి దుర్గా స్టాలిన్‌, మాజీ ముఖ్యమంత్రి ఓ.పన్నీర్‌సెల్వం, ఆయన కుటుంబ సభ్యులు, మాజీ ఆరోగ్యశాఖ కార్యదర్శి రాధాకృష్ణన్‌, సీనియర్‌ నటి లత, నటి మీనా, నటుడు విజయ్‌ తల్లి శోభ చంద్రశేఖర్‌ సహా పలువురు ఈ వేడుకలో పాల్గొన్నారు.

కాగా నటుడు రజనీకాంత్‌ తన 170వ చిత్ర షూటింగ్‌లో పాల్గొంటున్న కారణంగా ఈ వేడుకలకు హాజరుకాలేదు. ఆయన కూతుర్లు ఐశ్వర్య, సౌందర్యలు ఇంట జరిగిన వేడుకలో పాల్గొని సందడి చేశారు. ఈ సందర్భంగా లతా రజనీకాంత్‌ అతిథులందరికీ కానుకలు అందించారు.

చదవండి: వెంకటేశ్‌ కూతురి నిశ్చితార్థం.. చిరంజీవి, మహేశ్‌ బాబు హాజరు

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)