Breaking News

నా విలువలను వదులుకోను : కె. విజయభాస్కర్‌

Published on Sun, 07/28/2024 - 06:14

‘‘సినిమాల విషయంలో ప్రేక్షకుల అభిరుచి మారిందనే మాటని ఒప్పుకోను. ఎన్ని ఓటీటీలు వచ్చినా సినిమాలకు ఆదరణ తగ్గదు. అన్నీ సమ΄ాళ్లలో జోడించి ఎంటర్‌టైన్‌ చేయగలిగితే తప్పకుండా కుటుంబ సమేతంగా థియేటర్లకు వచ్చి సినిమాలు చూస్తారు. అలా ఫ్యామిలీ అంతా కలిసి వచ్చి చూసే చిత్రమే మా ‘ఉషా పరిణయం’’ అని డైరెక్టర్‌ కె. విజయభాస్కర్‌ అన్నారు.

‘నువ్వే కావాలి, నవ్వు నాకు నచ్చావ్, మన్మథుడు, మల్లీశ్వరి, జై చిరంజీవ’ వంటి చిత్రాలతో ప్రేక్షకులను అలరించిన కె.విజయ భాస్కర్‌ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం ‘ఉషా పరిణయం’. ఆయన తనయుడు శ్రీ కమల్‌ హీరోగా, తన్వీ ఆకాంక్ష హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రం ఆగస్టు 2న విడుదల కానుంది. ఈ సందర్భంగా కె. విజయ భాస్కర్‌ చెప్పిన విశేషాలు. 

⇒ ఎవరి కోసం కథ రాస్తామో వాళ్లను దృష్టిలో పెట్టుకుని కామెడీ రాస్తాం. ‘మన్మథుడు’  చిరంజీవిగారికి మ్యాచ్‌ కాదు. ‘జై చిరంజీవ’ వెంకటేశ్‌కి సరిపోదు. ‘నువ్వు నాకు నచ్చావ్‌’లో వెంకటేశ్‌ని తప్ప మరెవరినీ ఊహించుకోలేం. ‘ఉషా పరిణయం’ కథని మా అబ్బాయి శ్రీ కమల్‌ కోసం రాయలేదు. ఈ స్క్రిప్ట్‌ని ముగ్గురు హీరోలకు చె΄్పాను.. కానీ కుదరలేదు. ‘జిలేబి’ మూవీ తర్వాత నాకు సరిపోయే కథతో సినిమా చేయమని కమల్‌ అడిగాడు. తన వయసుకు, బాడీ లాంగ్వేజ్‌కి ‘ఉషా పరిణయం’ కథ సరిపోతుందనిపించి ముందుకెళ్లాం. శ్రీ కమల్, తన్వీ జోడీ అద్భుతంగా కుదిరింది. వారి నటన కూడా చాలా బాగుంటుంది. 

⇒ ప్రేమకు నేనిచ్చే నిర్వచనమే ‘ఉషా పరిణయం’. ప్రేమ ఎప్పుడూ హింసని కోరుకోదనేపాయింట్‌ని సందేశంలా కాకుండా వినోదాత్మకంగా చె΄్పాను. 

⇒మా సినిమా యూత్‌ఫుల్‌గా ఉంటుంది. కానీ, మా టార్గెట్‌ ఫ్యామిలీ ఆడియన్స్‌. ఇంట్లో అందరూ కలిసి కూర్చొని భోజనం చేస్తున్నట్లే సినిమాని కూడా కుటుంబమంతా కలిసి చూసేట్లు తీయాలి. నా దృష్టిలో దర్శకుడికి విలువలు ముఖ్యం. నేను సినిమా అయినా వదులుకుంటాను కానీ, నా విలువలను వదులుకోను. నా చిత్రాలను నా తల్లి, భార్య, పిల్లలతో కలిసి చూడాలనుకుంటాను. 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)