Breaking News

ట్రాఫిక్‌ రూల్స్‌ బ్రేక్‌ చేసిన హీరో విజయ్‌.. చలానా వేసిన పోలీసులు

Published on Wed, 07/12/2023 - 12:57

కోలీవుడ్‌ స్టార్‌ విజయ్‌ రాజకీయ రంగ ప్రవేశం చేయబోతున్నాడని కొంతకాలంగా జోరుగా ప్రచారం సాగుతోంది. విజయ మాటతీరు, అతడి వ్యవహార శైలి కూడా ఈ పుకార్లకు ఆజ్యం పోస్తోంది. ఇటీవల తమిళనాడులో పదో తరగతి, ప్లస్‌ 1, ప్లస్‌ 2 తరగతుల్లో మెరుగైన ఫలితాలు రాబట్టిన విద్యార్థులను, వారి తల్లిదండ్రులను పనైయూరులోని కార్యాలయానికి ఆహ్వానించి నగదు బహుమతులు, ప్రశంసా పత్రాలు అందించి సత్కరించాడు విజయ్‌. ఈ సందర్భంగా ఓటుకు నోటు విధానం మంచిది కాదని సూచించాడు.

తాజాగా మంగళవారం ఉదయం తన అభిమాన సంఘ నిర్వాహకులను, కార్యకర్తలను చైన్నెలోని తన కార్యాలయంలో కలిశాడు. తమిళనాడులోని అన్ని నియోజకవర్గాల్లోనూ జరుగుతున్న పరిణామాలు, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల గురించి చర్చించినట్లు సమాచారం. అలాగే రాజకీయ పరిణామాల గురించి సైతం మాట్లాడినట్లు తెలుస్తోంది.

ఇకపోతే ఈ భేటీ ముగిసిన తర్వాత విజయ్‌ తన కారులో ఇంటికి బయలుదేరాడు. ఈ సమయంలో ట్రాఫిక్‌ సిగ్నల్‌ను లెక్కచేయకుండా వెళ్లిపోయాడు. రెడ్‌ సిగ్నల్‌ ఉన్నప్పటికీ కారును అలాగే ముందుకు పోనివ్వడంతో ట్రాఫిక్‌ పోలీసులు రూ.500 చలానా వేశారు. ఇందుకు సంబంధించిన ఫోటో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసిన నెటిజన్లు.. 'ఏంటి హీరో ఇది.. మీరే ఇలా రూల్స్‌ బ్రేక్‌ చేస్తే మీ అభిమానులు ఏం పాటిస్తారు? ఇదేనా మీరు ఫ్యాన్స్‌కు ఇచ్చే సందేశం' అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

చదవండి: గ్లామర్‌ హీరోయిన్‌.. నిర్మాత ఒత్తిడితో వ్యభిచార కూపంలోకి.. చివరకు గుర్తుపట్టలేని స్థితిలో..
భర్తకు దూరంగా ఉండటంపై తొలిసారి స్పందించిన హేమమాలిని

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)