Breaking News

తమన్నాతో పెళ్లి.. వారింట్లో నుంచి విజయ్‌పై పెరుగుతున్న ఒత్తిడి

Published on Fri, 07/21/2023 - 11:36

మిల్కీ బ్యూటీ తమన్నా, బాలీవుడ్‌ నటుడు విజయ్‌ వర్మ  కొంతకాలంగా ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే. అయితే.. వీరిద్దరూ నిజంగా రిలేషన్‌లో లేరని, 'లస్ట్‌ స్టోరీస్‌ 2' ప్రచారం కోసం అలా చెప్పారని కూడా వార్తలు వచ్చాయి. అలాంటి ప్రచారాలకు చెక్‌ పెడుతూ తమన్నా, విజయ్‌ వర్మ ఇద్దరూ కూడా తమ రిలేషన్‌షిప్‌ గురించి ఓపెన్‌ అయ్యారు. తమన్నాతో పీకల్లోతు ప్రేమలో ఉన్నట్లు ఈ మధ్య విజయ్‌ బహిరంగంగానే చెప్పాడు. తామిద్దరూ డేటింగ్‌లో ఉన్నామని ఇప్పుడు తనకు బాగా అర్థమవుతోందన్నాడు.

ఆమెతో ఎంతో సంతోషంగా ఉన్నానంటూ.. తనను పిచ్చిగా ప్రేమిస్తున్నానని తెలిపాడు. ఆమె రాకతో తన జీవితంలో విలన్‌ దశ ముగిసిపోవడమే కాకుండా రొమాంటిక్‌ దశ మొదలైందని చెప్పాడు. తమన్నా భాటియాను పెళ్లి చేసుకోవాలని కుటుంబసభ్యుల నుంచి ఒత్తిడిని ఎదుర్కొంటున్నట్లు వస్తున్న వార్తలపై విజయ్ వర్మ పలు విషయాలు వెల్లడించాడు.

మళ్లీ తాజాగా తన పెళ్లి గురించి ఇంట్లో ఎలాంటి ఒత్తిడి ఉందో విజయ్‌ ఇలా స్పందించాడు. ' నా జీవితంలో పెళ్లిపై ఒత్తిడి ఎప్పుడో ప్రారంభమైంది.  నేను మార్వాడీని. మా కమ్యూనిటీలో, అబ్బాయిలు 16 ఏళ్లు రాగానే పెళ్లి చేసుకోగల వయస్సుగా పరిగణించబడతారు. కాబట్టి ఇవన్నీ ఎప్పుడో నా జీవితంలో ప్రారంభమయ్యాయి. కొన్నేళ్ల తర్వాత నా పెళ్లి గురించి ఆ ఒత్తిడి కొంచెం తగ్గింది.. ఎందుకంటే నేను పెళ్లి చేసుకునే వయస్సు ఎప్పుడో దాటిపోయింది. పైగా అప్పటికి నేను నటుడిని అయ్యాను. ఇదీ కూడా ఒక కారణం అని చెప్పవచ్చు.

(ఇదీ చదవండి: సినీ నటిపై రేప్‌.. ఇంటర్వ్యూ పేరుతో హోటల్‌కు తీసుకెళ్లి ఆపై..)

మా  అమ్మ మాత్రం పదేపదే పెళ్లి ప్రస్తావన తెచ్చేది. కానీ నేనే మాత్రం కెరీర్‌ వైపు మాత్రమే దృష్టి పెట్టాను. ఇప్పటికీ కూడా ఆమ్మ ఫోన్‌ కాల్‌ వస్తే మొదట అడిగే ప్రశ్న పెళ్లి ఎప్పుడు చేసుకుంటావు..? అనే ఉంటుంది.  సినిమాల వల్ల బిజీగా ఉండటంతో కుదరలేదని ఇంతవరకు చెప్పే వాడిని ఇప్పుడా అవకాశం లేదు. అని చెప్పుకొచ్చాడు.

(ఇదీ చదవండి: విజయ్‌సేతుపతితో మోస్ట్‌ కాంట్రవర్సీ హీరోయిన్‌ రొమాన్స్‌)

ఈ వ్యాఖ్యలతో తమన్నా-విజయ్‌ వర్మ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారని,  ఎప్పటి నుంచో పెళ్లి గురించి ఒత్తిడి తెస్తున్న తన తల్లి కోసం అయినా సాధ్యమైనంత త్వరలో తమన్నాతో ఏడడుగులు వేయడం ఖాయమని సోషల్‌మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. దీనిని బట్టి చూస్తే పెళ్లికి విజయ్‌ నుంచి గ్రీన్‌ సిగ్నల్‌ వచ్చినట్లే. కానీ..  సినిమాలతో ఫుల్‌ బిజీగా ఉన్న తమన్నా ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సిందే.

Videos

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)