Breaking News

కొత్త టాలెంట్‌ను బయటకు తీసిన విజయ్‌సేతుపతి

Published on Thu, 03/14/2024 - 14:08

స్టార్‌ హీరోలు పాటలు పాడడం పరిపాటిగా మారింది. కోలీవుడ్‌లో కమలహాసన్‌, విజయ్‌, శింబు, ధనుష్‌ వంటి వారు పాడిన పాటలు ప్రేక్షకుల నుంచి ఆదరణ పొందాయి. కాగా తాజాగా మరో మల్టీ టాలెంటెండ్‌ హీరో విజయ్‌సేతుపతి కూడా పాడడం మొదలెట్టారు. ఈయన 'కరా' అనే తమిళ చిత్రంలో ఓ పాట పాడారు. మాస్టర్‌ మహేంద్రన్‌ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం కరా.

దీని విశేషం ఏమిటంటే మొసలి ఇతి వృత్తంతో రూ పొందడం. ఈ చిత్రం ద్వారా నటి సాహిబా బాసిన్‌ నాయకిగా పరిచయం అవుతున్నారు. నటుడు జీవా ప్రతినాయకుడిగా నటిస్తున్న ఇందులో మొట్టై రాజేంద్రన్‌, సేలం వేంగై కె.అయ్యనార్‌ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని భవానీ ఎంటర్‌ప్రైజస్‌ పతాకంపై రాజేంద్రకుమార్‌ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ద్వారా అవతార్‌ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. అచ్చు రాజామణి సంగీతాన్ని, గీరీశన్‌ ఏజీఏ ఛాయాగ్రహణం అందిస్తున్నారు.

ఈ చిత్ర వివరాలను దర్శకుడు తెలుపుతూ మొసలి తమిళ పేరు కరా అని చెప్పారు. ఈ చిత్రం కోసం నటుడు విజయ్‌సేతుపతి పాడిన కాదల్‌ కుమారు వైరల్‌ ఆనారు అనే పాటను ఇటీవల విడుదల చేయగా అది ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో ట్రేండింగ్‌ అవుతోందని చెప్పారు. చిన్న పిల్లల నుంచి వయసు మళ్లిన వారు వరకూ ఆనందించే మంచి జనరంజకమైన కథా చిత్రంగా ఇది ఉంటుందన్నారు. ఈ చిత్రం సమ్మర్‌ స్పెషల్‌గా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు చెప్పారు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)