Breaking News

విజయ్‌సేతుపతితో మోస్ట్‌ కాంట్రవర్సీ హీరోయిన్‌ రొమాన్స్‌

Published on Fri, 07/21/2023 - 08:28

బాలీవుడ్‌ సంచలన నటి కంగనారనౌత్‌ హిందీ చిత్రాల్లో నటిస్తూనే దక్షిణాది చిత్రాలపై ఆసక్తి చూపుతున్నారన్నది తెలిసిందే. వివాదాలకు కేరాఫ్‌గా మారిన ఈమె ఇంతకుముందు తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత జీవిత చరిత్రతో రూపొందిన 'తలైవి' చిత్రంలో టైటిల్‌ పాత్రను పోషించారు. ప్రస్తుతం పి.వాసు దర్శకత్వంలో వస్తున్న చంద్రముఖి–2 చిత్రం షూటింగ్‌ను కూడా ఆమె పూర్తి చేసుకున్నారు. నిర్మాణాత్మక కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్రం ఆగస్టు 15న తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. ఇందులో లారెన్స్‌ కథానాయకుడిగా నటించారు.

(ఇదీ చదవండి: ప్రభాస్‌ 'ప్రాజెక్ట్‌ కె' టైటిల్‌, గ్లింప్స్‌ విడుదల.. హాలీవుడ్‌ రేంజ్‌లో సీన్స్‌)

మరో తమిళ చిత్రంలో నటించడానికి కంగనా రెడీ అవుతున్నట్లు తాజా సమాచారం. ట్రైడెంట్‌ ఆర్ట్స్‌, అహింసా ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మించనున్న ఈ చిత్రంలో ఒక తమిళ నటుడు, హిందీ నటి కలిసి నటించబోతున్నట్లు ఇంతకముందే వారు ఒక  ప్రకటన కూడా విడుదల చేశారు. తాజాగా ఈ క్రేజీ చిత్రంలో విజయ్‌సేతుపతి కథానాయకుడిగా నటించనున్నారు. ఆయనతోపాటు కంగనా నటించనున్నట్లు తెలిసింది.

(ఇదీ చదవండి: చిరంజీవి, విజయ్‌ విషయంలో చాలా బాధపడ్డాను: రష్మిక మందన్న)

దీనికి మలయాళం టాప్‌ దర్శకుడు విపిన్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. థ్రిల్లర్‌ కథాంశంతో రూపొందించనున్న ఈ చిత్రానికి సంబంధించిన పూర్తివివరాలు త్వరలోనే వెలువడే అవకాశం ఉంది. దీంతో ఈ రేర్‌ కాంబినేషన్లో తెరకెక్కనున్న ఈ చిత్రంపై ఇప్పటినుంచే ఆసక్తి నెలకొంది. కాగా నటి కంగనా స్వీయ దర్శకత్వంలో నటించి, నిర్మిస్తున్న హిందీ చిత్రం ఎమర్జెన్సీ త్వరలో తెరపైకి రావడానికి సిద్ధమవుతోందన్నది గమనార్హం.

Videos

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

లోకేష్ కు బుర్ర పనిచేయడం లేదు..! మిథున్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

బాబుకు హైకోర్టు షాక్.. బండి దీప్తి సంచలన కామెంట్స్

ఎమ్మెల్యే మాధవిరెడ్డి భర్త ఛాలెంజ్.. ఇచ్చిపడేసిన కడప YSRCP నేతలు

Photos

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)