Breaking News

డిమాన్‌ ఫస్ట్‌లుక్‌ రిలీజ్‌ చేసిన విజయ్‌ సేతుపతి

Published on Fri, 02/17/2023 - 09:09

జాతీయ ఉత్తమ దర్శకుడు అవార్డు గ్రహీత వసంత బాలన్‌ సమర్పణలో డిమాన్‌ అనే చిత్రం రూపొందుతోంది. వండర్‌ బాయ్స్‌ పిక్చర్స్‌ పతాకంపై ఆర్‌ సోమసుందరం నిర్మిస్తున్న ఈ చిత్రం ద్వారా రమేశ్‌ పళనీవేల్‌ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈయన అంగాడి తెరు, అరవాన్, కావ్యతలైవన్, జైల్, ఇదర్కుదానా ఆశపట్టాయ్‌ బాల కుమారా, కాష్మోరా చిత్రాలకు సహాయకుడిగా పనిచేశారు. ఇందులో నటుడు సచిన్, నటి అబర్నది జంటగా నటిస్తున్నారు. చిత్ర వివరాలను దర్శకుడు తెలుపుతూ ఇది యథార్థ సంఘటనలతో కూడిన  హర్రర్‌ నేపథ్యంలో సాగే సస్పెన్స్‌ థ్రిల్లర్‌ కథా చిత్రం అని చెప్పారు.

చిత్రం స్క్రీన్‌ పై ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేస్తుందని అన్నారు. పిజ్జా, రక్షకన్, పిశాచి వంటి చిత్రాల తరహాలో ఇది ఆసక్తికరమైన సన్నివేశాలతో సాగుతుందన్నారు. చిత్రంలో కుంకీ అశ్విన్, రవీనా దహ, బిగ్‌ బాస్‌ ఫ్రేమ్‌ శతి పేరియసామి, మిప్పుసామి ప్రభాకరన్, అశోక్, ధరణి, నవ్య సుజి, సలీమా ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి రోనీ రఫెల్‌ సంగీతాన్ని, ఆర్‌ఎస్‌ ఆనంద్‌ కుమార్‌ చాయాగ్రహణంం అందిస్తున్నారు. కాగా ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను గురువారం నటుడు విజయ్‌సేతుపతి దర్శకుడు మిష్కిన్‌ ఆన్‌లైన్‌ ద్వారా విడుదల చేశారు. దీనికి మంచి స్పందన వచ్చిందని చిత్ర వర్గాలు తెలిపాయి.

చదవండి: స్వాతంత్య్ర సమరయోధురాలిగా మిస్‌ చెన్నై

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)