Breaking News

విజయ్‌ సేతుపతి సూపర్‌ హిట్‌ సినిమాకు సీక్వెల్‌ రెడీ

Published on Fri, 08/04/2023 - 06:53

కోలీవుడ్‌ నటుడు విజయ్‌ సేతుపతికి కథానాయకుడిగా మంచి విజయాన్ని అందించిన చిత్రం పిజ్జా. ఈ చిత్రంలో విజయ్ సేతుపతి, రమ్య నంబీషన్ ప్రధాన పాత్రలు పోషించారు. రొమాంటిక్‌ థ్రిల్లర్‌ సినిమా తమిళ ప్రేక్షకులతో పాటు తెలుగువారిని కూడా విశేషంగా ఆకట్టుకుని, ఘన విజయం అందుకుంది. కాగా పిజ్జా చిత్రం సక్సెస్‌తో ఆ తర్వాత దానికి సీక్వెల్‌గా పిజ్జా –2 విల్లా చిత్రాన్ని నిర్మించారు. ఆ చిత్రం మంచి విజయాన్ని సాధించింది.

దీంతో అదే సంస్థలో సీవీ కుమార్‌ ఇటీవల నిర్మించిన చిత్రం పిజ్జా –3 దిమమ్మీ . నటుడు అశ్విన్‌ కాక్కుమను కథానాయకుడిగా నటించిన ఈ చిత్రంలో రవీనా దాహా, సుభిక్ష తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. మోహన్‌ గోవింద్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రం గత నెల 28వ విడుదలై విమర్శకుల ప్రశంసలు, ప్రేక్షకుల ఆదరణతో విజయవంతంగా ప్రదర్శింపబడుతోంది.

(ఇదీ చదవండి: కోకాపేట ఆంటీ ఎప్పుడో చెప్పింది.. ఆ ఏరియా చాలా రిచ్‌ అని!)

దీంతో పిజ్జా– 4 చిత్రాన్ని కూడా నిర్మించనున్నట్లు నిర్మాత సీవీ కుమార్‌ మీడియా విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. తాను ఇంతకు ముందు హారర్ర్‌, సస్పెన్స్‌ నేపథ్యంలో రూపొందించిన పిజ్జా చిత్రం మూడు సీక్వెల్స్‌ ను ప్రేక్షకులు మంచి విజయాన్ని అందించి వైవిధ్య భరిత కథా చిత్రాలకు ఎప్పుడు ఆదరణ ఉంటుందని నిరూపించారన్నారు. వారు ఇచ్చిన నమ్మకంతోనే పిజ్జా –4 చిత్రాన్ని నిర్మించనున్నట్లు చెప్పారు. దీనికి సంబంధించిన దర్శకుడు, నటినటులు, సాంకేతిక వర్గం వివరాలను త్వరలోనే వెళ్లడించనున్నట్లు నిర్మాత సీవీ కుమార్‌ చెప్పారు.

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)