Breaking News

Maharaja: ఓటీటీలో ‘మహారాజా’ రికార్డు

Published on Tue, 07/16/2024 - 13:07

విజయ్‌ సేతుపతి హీరోగా నటించిన యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘మహారాజా’ ఎంత పెద్ద విజయం సాధించిందో అందరికి తెలిసిందే. పెద్దగా ప్రచారమే లేకుండా జూన్‌ 14న విడుదలైన ఈ చిత్రం.. మౌత్‌ టాక్‌తోనే బ్లాక్‌ బస్టర్‌ హిట్‌గా నిలిచింది. కేవలం రూ. 20 కోట్లతో బడ్జెట్‌తో తెరకెక్కి.. రూ. 100 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. తెలుగులోనూ ఈ చిత్రానికి మంచి వసూళ్లే వచ్చాయి. జులై 12 నుంచి ఈ చిత్రం ప్రముఖ ఓటీటీ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌ అవుతోంది. థియేటర్స్‌ ప్రేక్షకులను కాదు.. ఓటీటీ ప్రియుల మనసును కూడా ‘మహారాజా’ దోచేశాడు. నెట్‌ఫ్లిక్స్‌లో ఈ వారం ట్రెండింగ్‌ జాబితాలో(ఇండియాలో) ‘మహారాజా’ తొలి స్థానం దక్కించుకుంది. ఈ విషయాన్ని చిత్రబృందం తెలియజేస్తూ.. ‘ప్రతిచోటా మహారాజ రికార్డులు సృష్టిస్తోంది’ అని ఆనందం వ్యక్తం చేసింది.

‘మహారాజా’ కథేంటంటే.. 
మహారాజా(విజయ్‌ సేతుపతి) ఓ బార్బర్‌. అతనికి భార్య, కూతురు ఉంటుంది. ఓ ప్రమాదంలో భార్య చనిపోవడంతో.. కూతురుతో కలిసి సిటీకి దూరంగా ఓ ఇంట్లో జీవిస్తుంటాడు. అతని కూతురు ప్రాణాలు కాపాడిన చెత్తబుట్టకు లక్ష్మి అని పేరు పెట్టి.. ఫ్యామిలీ మెంబర్‌లా చూసుకుంటాడు. అయితే ఓ రోజు నిండు గాయాలతో పోలీసు స్టేషన్‌కి వెళ్లి.. ముగ్గురు దుండగులు తన ఇంట్లోకి చొరబడి ‘లక్ష్మి’ని ఎత్తుకెళ్లారని ఫిర్యాదు చేస్తారు. 

(చదవండి: అభిమానులతో పాటు మంచి మనసు చాటుకున్న సూర్య)

తన కూతురు ప్రాణాలను కాపాడిన ‘లక్ష్మి’ని ఎలాగైనా వెతికి పెట్టమని పోలీసులకు విజ్ఞప్తి చేస్తాడు. దాన్ని వెతికేందుకు పోలీసులకు రూ. 7 లక్షల లంచం ఇవ్వడానికి కూడా సిద్దపడతాడు. మరి ‘లక్ష్మి’ని ఎత్తుకెళ్లిన ఆ ముగ్గురు ఎవరు? వారికి మహారాజాతో ఉన్న వైరం ఏంటి? రూ. 500 వందల విలువ చేసే చెత్తబుట్ట(లక్ష్మి) కోసం రూ. 7 లక్షలు కూడా ఇవ్వడానికి కారణం ఏంటి? చివరకు లక్ష్మి దొరికిందా లేదా? అనేదే మిగతా కథ. ఈ చిత్రానికి నిథిలన్‌ స్వామినాథన్‌ దర్శకత్వం వహించగా.. అనురాగ్‌ కశ్యప్‌, మమతా మోహన్‌దాస్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు .

Videos

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)