Breaking News

ఓటీటీని షేక్‌ చేసేలా విజయ్‌ సేతుపతి వెబ్‌ సిరీస్‌.. స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే..

Published on Thu, 03/12/2026 - 14:20

రియలిస్టిక్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే దర్శకుడు మణికందన్.. కాకా ముట్టై, కడైసి వివసాయి వంటి సినిమాలతో జాతీయ అవార్డ్స్‌ అందుకున్న ఆయన ‘కాట్టాన్’ (ముత్తు అలియాస్ కాట్టాన్) అనే వెబ్‌ సిరీస్‌ తెరకెక్కించారు. మార్చి 27న జియోహాట్‌స్టార్‌లో విడుదల కానుంది. తమిళ్‌తో పాటు తెలుగు, కన్నడ, హిందీ, మలయాళంలో స్ట్రీమింగ్‌ కానుంది. ఇందులో హీరోగా విజయ్‌ సేతుపతి నటిస్తున్నడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి.

జియో హాట్‌స్టార్(JioHotstar) స్పెషల్ సిరీస్‌గా మార్చి 27, 2026న కాట్టాన్‌  (Kaattaan) ప్రీమియర్ అవుతుందని  అధికారికంగా ప్రకటించింది. ఈ ప్రాజెక్ట్‌ను విజయ్ సేతుపతి తన సొంత ప్రొడక్షన్ బ్యానర్‌పై నిర్మించగా.., రాజేష్ మురుగేశన్ సంగీతం సమకూర్చారు. విజయ్ సేతుపతి - మణికందన్ కాంబినేషన్‌లో ఇప్పటికే ఆండవన్ కట్టలై, కడైసి వివసాయి వంటి బ్లాక్‌బస్టర్‌ సినిమాలు వచ్చాయి. విమర్శకుల నుంచి కూడా ప్రశంసలు అందుకున్నాయి. తాజాగా వీరి కాంబినేషన్‌లో వెబ్‌ సిరీస్‌ రానున్నడంతో ఫ్యాన్స్‌ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఈ వెబ్‌ సిరీస్‌ రా అండ్ రస్టిక్ రూరల్ యాక్షన్ డ్రామాగా ఉండబోతోందని మేకర్స్‌ ప్రకటించారు. ఇందులో విజయ్‌ సేతుపతి పాత్ర గతంలో ఎన్నడూ చూడని  అత్యంత ఉగ్ర రూపంలో కనిపిస్తారని టాక్‌. ఇందులో హింస తీవ్రత కాస్త ఎక్కువగానే ఉండనుందని తెలుస్తోంది.

Videos

రాయచోటిలో హైటెన్షన్.. YSRCP ఆఫీస్ కి వాహనాలకి నిప్పు

విశాఖ మేయర్ అభ్యర్థిగా వరుదు కళ్యాణి

రణబాలి సెన్సార్ రివ్యూ అవుట్.. సినిమా ఎలా ఉండనుందంటే..!

సుపారి ఇచ్చిన TDP నేతలు మిథున్ రెడ్డిపై మర్డర్ స్కెచ్ బట్టబయలు

దసరాకు విశ్వంభర సర్ ప్రైజ్ ...

EXCLUSIVE VISUALS: చేతికి గాయాలతో మిథున్ రెడ్డి

బంగారం కొనేవారికి గుడ్ న్యూస్! ఇవాళ తులం ఎంతంటే

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)