Breaking News

మీసాలు తీసేసి యంగ్‌గా మారిన విజయ్ సేతుపతి.. సాయి పల్లవితో లవ్‌స్టోరీ!

Published on Wed, 07/29/2026 - 09:33

సాధారణంగా ఒక్కో సినీ దర్శకుడికి ఒక్కో ముద్ర ఉంటుంది. అయితే ఏ తరహా కలనైనా తనదైనశైలిలో తెరపై ఆవిష్కరించి విజయం సాధించగల సత్తా కలిగిన దర్శకుడు మాత్రం మణిరత్నం ఒక్కరే అని చెప్పాలి. ఈయన రోజూ, బొంబాయి వంటి సున్నితమైన ప్రేమ కథా చిత్రాన్ని హృద్యంగా తెరకెక్కించగలరు, దళపతి,నాయకన్‌ వంటి యాక్షన్‌ ఎలిమెంట్స్‌ తో కూడిన కమర్షియల్‌ ఎంటర్‌ టైన్మెంట్‌ కథా చిత్రాలతోనూ ప్రేక్షకులను ఆకట్టుకోనూ గలరు. అదే విధంగా ఓ కణ్మణి వంటి రోమాంటిక్‌ కథా చిత్రాలతో కురక్రారును అలరించగలరు. 

పొన్నియిన్‌ సెల్వన్‌ వంటి చారిత్రాత్మక కథా చిత్రాలను బ్రహ్మాండంగా తెరపై ఆవిష్కరించగలరు. అలాగని మణిరత్నం చేసిన చిత్రాలు అన్నీ హిట్‌ అని చెప్పట్లేదు. ఇటీవల ఆయన చేసిన థగ్‌ లైఫ్‌ చిత్రం ప్రేక్షకులను పూర్తిగా నిరాశ పరిచింది. దీంతో చిన్న బ్రేక్‌ తీసుకుని మళ్లీ యూత్‌ ఫుల్‌ లవ్‌ స్టొరీతో ప్రేక్షకుల ముందుకు పొందడానికి సిద్ధం అవుతున్నారు. అందుకు ఆయన విజయ్‌ సేతుపతి నటి, సాయి పల్లవి ని ప్రధాన పాత్రధారులుగా ఎంచుకున్నారు.

ఈ చిత్రం ఎలాంటి చడీ చప్పుడు లేకుండా ఇటీవల కోల్‌కత్తాలో షూటింగ్‌ ను ప్రారంభించుకుని అక్కడ ప్రసిద్ధి చెందిన హౌరా బ్రిడ్జి దాని పరిసర ప్రాంతాల్లో తొలి షెడ్యూల్‌ పూర్తి చేసుకునే పనిలో ఉంది చిత్ర యూనిట్‌. అక్కడ ఓ బ్యూటీఫుల్‌ పాటను చిత్రీకరిస్తున్నారు తెలిసింది. మణిరత్నం ఆస్థాన సంగీత దర్శకుడు ఏఆర్‌ రెహమాన్‌ సంగీతాన్ని అందిస్తున్నారు. కాగా ఇంకా పేరు నిర్ణయించిన ఈ చిత్రాన్ని మణిరత్నంకు చెందిన మద్రాస్‌ టాకీస్‌,లైకా ప్రొడక్షన్స్‌ సంస్థలు నిర్మిస్తున్నాయి. 

కాగా ఈ చిత్రం కోసం విజయ్‌ సేతుపతిని, సాయి పల్లవిని మణిరత్నం పూర్తిగా మార్చేశారు. ముఖ్యంగా మీసం, గడ్డాలతో ముదురుగా కనిపించే విజయ్‌ సేతుపతిని యంగ్‌గా చూపించే ప్రయత్నం చేస్తు న్నారు. ఇది యూత్‌ ఫుల్‌ ప్రేమ కథా చిత్రంగా ఉంటోందని పిస్తోంది.

Videos

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)