Breaking News

విజయ్ సేతుపతి ఫ్రీగా నటించిన సినిమా.. ఇన్నాళ్లకు ఓటీటీలో రిలీజ్

Published on Mon, 06/24/2024 - 11:27

విజయ్ సేతుపతి చాలా రోజుల తర్వాత హిట్ కొట్టాడు. 'మహారాజ' మూవీతో తెలుగు, తమిళంలో అద్భుతమైన వసూళ్లు సొంతం చేసుకుంటున్నాడు. మూవీ వచ్చిన రెండు వారాలైనప్పటికీ కలెక్షన్స్ స్టడీగా ఉన్నాయి. మరోవైపు ఇతడు రెమ్యునరేషన్ తీసుకోకుండా నటించిన ఓ తమిళ మూవీ తాజాగా ఓటీటీలోకి వచ్చేసింది. ఇంతకీ ఆ మూవీ సంగతేంటి? ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది?

(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 21 సినిమాలు రిలీజ్.. అవి ఏంటంటే?)

సేతుపతి అద్భుతమైన నటుడు. కాకపోతే సరైన హిట్ పడి చాలా కాలమైంది. రీసెంట్‌గా తన 50వ మూవీ 'మహారాజ'తో అద్భుతమైన సక్సెస్ అందుకున్నాడు. మరోవైపు ఇతడు అతిథి పాత్రలో నటించిన తమిళ మూవీ 'అళగియ కన్నె'.. గతేడాది జూన్ 23న థియేటర్లలోకి వచ్చింది. ఏమైందో ఏమో గానీ ఏడాది తర్వాత అమెజాన్ ప్రైమ్ ఓటీటీలోకి వచ్చేసింది. వచ్చిందే లేటు అంటే మళ్లీ అద్దె విధానంలో అందుబాటులోకి తీసుకొచ్చారు.

రొమాంటిక్ డ్రామా స్టోరీతో తీసిన ఈ సినిమాలో లియో శివకుమార్, సంచితా శెట్టి హీరోహీరోయిన్లుగా నటించారు. ఆర్ విజయ్ కుమార్ దర్శకుడు. ఈ మూవీ డైరెక్టర్‌పై ఉన్న అభిమానంతోనే విజయ్ సేతుపతి.. ఎలాంటి డబ్బులు తీసుకోకుండా నటించాడు. ఇందులో నిజ జీవిత పాత్రనే పోషించడం విశేషం. కాకపోతే సినిమా రొటీన్‌గా ఉండేసరికి జనాలు సినిమా పెద్దగా ఆడలేదు.  

దర్శకుడు కావాలనే ఓ కుర్రాడు.. నాటకాల్లో పరిచయమైన ఓ అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. కానీ కులాల వేరు కావడంతో పెద్దలు ఇబ్బంది పెడుతుంటారు. అలాంటి ఈ కుర్రాడికి విజయ్ సేతుపతిని డైరెక్ట్ చేసే ఛాన్స్ ఎలా వచ్చింది? చివరకు ఏమైందనేదే మెయిన్ స్టోరీ.

(ఇదీ చదవండి: ప్రభాస్ ఫ్యాన్స్‌కి సారీ చెప్పిన అమితాబ్.. ఎందుకంటే?)

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)